1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Is the Film Chamber of Commerce divided along 'Telangana vs. Andhra' lines?

Sunil Narang: తెలంగాణ వర్సెస్ ఆంధ్రా గా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ వుందా?

Sunil Narang
Sunil Narang
ఇటీవల ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు, నిర్మాతలు ఎవరికి వారు తమ సమస్యలను ఏకరువు పెడుతూ మీడియా ముందుకు రావడం అందులో నిర్మాత నాగవంశీకి, నిర్మాత, ఎగ్జిబిటర్ అయినా తెలంగాణ వ్యక్తి సునీల్ నారంగ్ కు మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆయన తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవిలో వున్నారు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ఏషియన్ మల్టీప్లెక్స్‌ల అధినేత, నిర్మాత సునీల్ నారంగ్.
 
అయితే నేటి ఫిలింనగర్ కథనాలు ప్రకారం ఆయన ఆ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కేవలం వ్యక్తిగత కారణాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటూ ఆయన ఫిలిం ఛాంబర్‌కు అధికారికంగా ఈమెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపించారని తెలిసింది. దీనితో ఫిలిం ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అత్యవసరంగా సమావేశమై ఆమోదించిందట.
 
అయితే ఇండస్ట్రీ సమస్యలను మీడియా ముందుకు తీసుకురావడంతో కొన్నివర్గాలు తప్పు పట్టాయి. వారి వారి సమావేశాల్లో తేల్చుకోవాల్సింది ఇలా మీడియా ముందుకు వచ్చి తప్పు చేశారంటూ ట్రేడ్ వర్గాలు కూడా పేర్కొన్నాయి. ఇంత గొడవ జరిగాక అగ్ర నిర్మాతలు ఓ కమిటీని వేసి పరిశీలిస్గున్నట్లు ప్రకటించారు. ఇది జరిగిన మూడో రోజుకు సునీల్ ఇలా రాజీనామా చేయడం విశేషం సంతరించుకుంది. ఎందుకంటే.. ఎక్కువ మంది నిర్మాతలు, పంపిణీ రంగంలోని వారంతా ఆంధ్రపదేశ్ మూలాలు వున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. దిల్ రాజు, సునీల్ వంటి కొందరు మాత్రమే వుండడంతో ఇలా జరిగివుంటుందని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వయస్సు నుబట్టి కూడా చూడకుండా నాగవంశీ.. సునీల్ ను ఎద్దేవా చేసినట్లు మీడియా ముందు మాట్లాడడం, ఆ తర్వాత ఆయన కూడా విగ్గుపెట్టుకుని పాము లాంటి పేరు అంటూ నాగవంశీ గురించి కౌంటర్ వేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
 
టాలీవుడ్‌లో థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు మధ్య బేషజాలు, పంతాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో రాబోయే కొత్త అధ్యక్షుడు ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తాడో చూడాలి.
About Writer
దేవీ
తర్వాతి కథనం
పొరపాటున కూడా నా కలలోకి రావొద్దంటున్న 'డ్రాగన్'