అవి నా ఫోటోలు కాదు.. ఏఐ సృష్టించిన చిత్రాలు.. రుక్మిణి వసంత్
ఆన్‌లైన్‌లో తనవిగా తప్పుగా ప్రచారం అవుతున్న కొన్ని ఏఐ సృష్టించిన చిత్రాలపై నటి రుక్మిణి వసంత్ తీవ్రంగా స్పందించారు. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ఆ చిత్రాలు పూర్తిగా నకిలీవి, కల్పితమైనవని స్పష్టం చేశారు. అంతేకాకుండా, తమ బృందం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని కూడా వెల్లడించారు.
తాను అని చెప్పుకుంటూ ఆన్‌లైన్‌లో ప్రచారం అవుతున్న కొన్ని ఏఐ-సృష్టించిన చిత్రాలను తన బృందం, తాను చూశామని తెలిపారు. ఈ చిత్రాలు పూర్తిగా నకిలీవి, కల్పితమైనవని తాను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఇలా తారుమారు చేయబడిన కంటెంట్‌ను సృష్టించడం, ప్రచారం చేయడం చాలా బాధ్యతారాహిత్యం, గోప్యతను తీవ్రంగా ఉల్లంఘించడమేనని తెలిపారు.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ చిత్రాలను సృష్టించి, వ్యాప్తి చేయడంలో పాలుపడిన వారిపై అవసరమైన చట్టపరమైన, సైబర్ క్రైమ్ చర్యలు ప్రారంభిస్తున్నామని తెలిపారు.
