సంబంధిత వార్తలు
- విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ (Video)
- 'జయం' రవితో కెనీషా ఫ్రాన్సిస్ బ్రేకప్ - ఫెమినిజం గెలిచింది.. ఆనందం ఓడిపోయింది..
- 11 నెలల పాటు ఈఎంఐ కట్టలేదు.. వేలానికి రవి మోహన్ ఇల్లు.. నోటీసులు అంటించేశారు..
- నా చిత్రాలేకాదు కొత్తవారికి అవకాశం కోసమే నిర్మాణసంస్థ ప్రారంభించా : రవి మోహన్
- Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?
Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్ కట్
Kenisha Breaks Up With Jayam Ravi
ఎంతో ప్రేమతో అడుగుపెట్టానని.. కానీ ప్రస్తుతం నిశ్శబ్దంతో వెనుదిరుగుతున్నాను. ఒక మనిషిని రక్షించే ప్రయత్నంలో తనను కాను కోల్పోయానని తెలిపింది. ప్రదర్శనలకు ప్రాధాన్యమిచ్చే ఈ లోకంలో మంచితనానికి విలువ లేదని కెనీషా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. "ఎవరైతే అతడి (జయం రవి)పై పూర్తి హక్కులు ఉన్నాయని భావిస్తున్నారో వారికి చెబుతున్నాను. అతడు (జయం రవి) ఇక పూర్తిగా మీవాడే. ఇకపై ఎలాంటి వివరణలు ఇవ్వను, యుద్ధాలు చేయలేను" అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రపంచం అబద్ధాలకోరులతో నిండిపోయిందని, భావోద్వేగాలతో అల్లిన కథలనే జనం నమ్ముతారని ఆమె వాపోయారు. తాను ఓడిపోయానని.. చెన్నై విడిచి వెళ్తున్నానని, తన సంగీతాన్ని, తన జీవితానికి సంబంధించిన ప్రతిదాన్ని వదిలేస్తున్నానని తెలిపింది. ఈ ఆన్‌లైన్ వేధింపులు, ట్రోలింగ్స్ వల్లే తాను వీటన్నింటికీ దూరమవుతున్నాను. ఫెమినిజం గెలిచింది, కానీ సంతోషం ఓడిపోయిందంటూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
