Peddi Latest: తాజా న్యూస్ - పెద్దిని షూటింగ్ సెట్లో కలిసి సలహాలచ్చిన ఉస్తాద్ గబ్బర్ సింగ్ ?
Peddi and Ustaad Gabbar Singh
ఉస్తాద్ గబ్బర్ సింగ్ ప్రమోషన్ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన పవన్ కళ్యాణ్ పెద్ది సెట్ కు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇదిలా వుండగా, ఈ చిత్ర షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందుకు రెండు టీమ్ లుగా ఏర్పాటుచేసి అనుకున్న టైంకు విడుదలచేసేందుకు దర్శకుడు బుజ్జి సనా, నిర్మాతలు క్రిషిచేస్తున్నారు. నిర్మాతల ప్రకారం, మొత్తం షూటింగ్ పూర్తి చేయడానికి వారికి మరో పది రోజుల కాల్ షీట్లు అవసరమని సమాచారం. అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే, త్వరలోనే సినిమాను పూర్తి చేస్తామని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన 'పెద్ది' చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చగా, దివ్యేందు శర్మ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.
