''కబాలి'' హీరోయిన్ రాధికా ఆప్టే హాట్ ఫోటో షూట్.. కేవలం వైట్ టాప్‌తో..?
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బోల్డ్ హీరోయిన్లకు ఏమాత్రం కొదవలేదనే చెప్పాలి. బోల్డ్ సీన్స్‌లో నటించడంలో ఏమాత్రం వెనకడుగు వేయని హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. వీరిలో కబాలి హీరోయిన్ రాధికా ఆప్టే కూడా ఒకరు. దక్షిణాది సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌లో అందాల ఆరబోతలో ఇరగదీసే రాధికా ఆప్టే.. ధైర్యంగా ఎలాంటి సీన్స్ అయినా తేలిగ్గా నటించేస్తుంది. క్యారెక్టర్ కోసం ఏదైనా చేసేందుకు సై అనే ఈ భామ క్యారెక్టర్, ఛాన్సుల పరంగా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు కొట్టేసింది.
తాజాగా ఓ మేగజైన్ కోసం రాధికా ఆప్టే బోల్డ్‌గా దిగడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎఫ్ హెచ్ఎం తాజా సంచిక కోసం రాధికా ఆప్టే హాట్ ఫోటో సెషన్ చేసింది. ఈ విషయం నిజమేనని కవర్ పేజీలో చూస్తేనే అర్థమైపోతుంది. ఒంటిపై కేవలం ఓ వైట్ టాప్ మాత్రమే ధరించి క్లీవేజ్‌తో ఫోజిచ్చింది.
అంతే ఈ ఫోటో చూసి బాలీవుడ్ జనం ముక్కుమీద వేలేసుకున్నారు. రాధిక డేర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కవర్ పేజీలోనే కాకుండా మేగజైన్ లోపల హాట్ స్టఫ్ చాలానే ఉందంటూ రాసిన కొటేషన్స్ అదిరిపోయాయి. మొత్తానికి రాధిక ఈ హాట్ ఫోటో సెషన్ ద్వారా హీటు పుట్టించిందని సినీ పండితులు అంటున్నారు.