1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Rajasekhar Reveals Sridevi Marriage Proposal That Changed His Life

శ్రీదేవితో పెళ్లి చేయాలనుకున్నారు.. జీవిత మాట విని షాక్ అయ్యాను.. రాజశేఖర్

Rajsekhar_Sridevi
Rajsekhar_Sridevi
సీనియర్ నటుడు రాజశేఖర్ తాజా ఇంటర్వ్యూలో తన పెళ్లికి ముందు జరిగిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రాజశేఖర్, జీవిత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి కంటే ముందు ఆయన ఇంట్లో వేరే సంబంధం గురించి మాట్లాడారని తెలిపారు. ఆ సమయంలో శ్రీదేవితో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిశ్చయించారని చెప్పారు. 
 
ఇద్దరూ ఒకే కులానికి చెందినవారు కావడంతో ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఇంట్లో ఒత్తిడి చేసారట. ఈ విషయం జీవితకు చెప్పినప్పుడు, "మీరు వేరే పెళ్లి చేసుకుంటే మీ ఇష్టం, కానీ నేను మాత్రం జీవితాంతం పెళ్లి చేసుకోను" అని ఆమె చెప్పిందట. ఆ మాట విని తాను చాలా ఆశ్చర్యపోయానని రాజశేఖర్ గుర్తుచేసుకున్నారు. తాను డాక్టర్ కావాలని కుటుంబం కోరుకున్నా, నటనపై ఆసక్తితో సినిమా రంగంలోకి వచ్చానని చెప్పారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
MAA: మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ను దుర్వినియోగం చేసేవారికి హెచ్చరిక