సంబంధిత వార్తలు
- Ramcharan: పెద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతోంది రాసిపెట్టుకోండి.: రామ్ చరణ్
- Peddi: రామ్ చరణ్ తో ఐటెంసాంగ్ లో అలరించిన శృతి హాసన్, జాన్వీ కపూర్
- Ramcharan: నా కూతురిని ఎత్తుకున్నా నొప్పి పెడుతుంది : రామ్ చరణ్
- Shruti Haasan: హెల్లాల్లో స్టెప్లతో అలరించిన రామ్ చరణ్, శ్రుతిహాసన్
- Charan: డ్రైవింగ్ త్రూ పెద్ది మెమరీస్ పంచుకున్న రామ్ చరణ్, బుచ్చిబాబు
పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్
టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరైన రామ్ చరణ్ నియమించుకున్న బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం ఇస్తున్నారట. పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నుంచి గాంబియా దేశానికి చెందిన కెవిన్ రామ్ చరణ్ వెంట వుంటూ భద్రతను చూస్కుంటున్నారు. కాగా ఇతడు ఇటలీ మిడిల్ వెయిట్ ఛాంపియన్ గా రికార్డులు సాధించిన చరిత్ర వుంది. మొత్తమ్మీద అత్యంత పటిష్టమైన బాడీగార్డునే నియమించుకున్నారని చర్చించుకుంటున్నారు.
రామ్ చరణ్ బాడీగార్డ్‌కు రోజుకు రూ.2లక్షలు?
— ChotaNews App (@ChotaNewsApp) May 25, 2026
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నియమించుకున్న బాడీగార్డ్ గురించి SMలో తెగ చర్చ జరుగుతోంది. పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నుంచి ప్రతీ కార్యక్రమంలో ఆయన వెంటే ఉంటూ భద్రత కల్పిస్తున్నారు అంతర్జాతీయ MMA ఫైటర్ కెవిన్ కుంటా. గాంబియా దేశానికి చెందిన… pic.twitter.com/YJt48j5bnC
పెద్ది కీ ఆవాజ్...
పెద్ది ఐటెం సాంగ్‌లో శృతి హాసన్‌తో పాటు జాన్వీ కపూర్ కూడా వున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. నిన్న భోపాల్‌లో పెద్ది వేడుక జరిగింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలవగా, తాజాగా మూడో సింగిల్ హల్లల్లల్లో కూడా అదే జోరును కొనసాగిస్తోంది. భోపాల్‌లో నిర్వహించిన భారీ పెద్ది కీ ఆవాజ్ ఈవెంట్‌లో ఈ పాటను లాంచ్ చేయగా, ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. అనంతరం డిజిటల్‌గా విడుదలైన ఈ పాట అంచనాలకు మించి ఆదరణ దక్కించుకుంటోంది.
భారీ బీట్స్, డ్రమ్స్, జానపద శైలిలో సాగే రిథమ్‌తో ఏఆర్ రెహమాన్ ఈ పాటను మాస్ యాంథమ్‌లా తీర్చిదిద్దారు. మొదటి క్షణం నుంచే ఆకట్టుకునే ఈ ట్యూన్ ఆఖరి వరకు అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తుంది. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం పాటకు మరింత మాస్ అప్పీల్‌ను తీసుకొచ్చింది. జానపదంతో కూడిన పదాలు పాటకు ప్రత్యేకమైన నేటివిటీని అందించాయి. రక్షితా సురేష్ తన పవర్‌ఫుల్ వాయిస్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆమె వాయిస్ లోని ఎనర్జీ, రెహమాన్ బీట్స్‌తో కలిసి వినసొంపైన సంగీతానుభూతిని అందిస్తోంది.
విజువల్గాహల్లల్లల్లో ఒక గ్రాండ్ స్పెక్టకిల్‌లా కనిపిస్తోంది. భారీ సెట్‌లో చిత్రీకరించిన ఈ పాటలో రామ్ చరణ్, శృతి హాసన్, జాన్వీ కపూర్ ముగ్గురూ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ తన స్టైలిష్ లుక్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు, శృతి హాసన్ తన గ్లామర్, గ్రేస్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాన్వీ కపూర్ కూడా తన ఎలిగెన్స్, ఎనర్జీతో పాటకు మరింత కలర్ యాడ్ చశారు. ముగ్గురి కాంబినేషన్ ఈ పాటను ఓ విజువల్ ట్రీట్‌గా మార్చింది.
మాస్ కథల్లో స్పెషల్ సాంగ్స్ ప్రాధాన్యతను బాగా అర్థం చేసుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా, ఈ పాటను కూడా భారీ స్థాయిలో మలిచారు. ప్రతి ఫ్రేమ్‌లో కనిపించే నిర్మాణ విలువలు, సెట్స్, కాస్ట్యూమ్స్, కలర్ ప్యాలెట్ సినిమాకి ఉన్న గ్రాండియర్‌ను ప్రజెంట్ చేస్తున్నాయి. హల్లల్లల్లో ఈ ఏడాది అత్యంత మాస్, క్రేజీ పాటల్లో ఒకటిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. జూన్ 4న విడుదలకు సిద్ధమవుతున్న పెద్ది పై ఈ పాట మరింత హైప్‌ను పెంచింది. థియేటర్లలో ఈ పాట వచ్చేసరికి విజిల్స్, క్లాప్స్, సెలబ్రేషన్స్‌తో ప్రేక్షకులు ఊగిపోవడం ఖాయమనేలా హల్లల్లల్లో అలరిస్తోంది. తారాగణం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ
