మళ్లీ కలిసి జీవించనున్న విజయ్ - సంగీత..? త్రిష పరిస్థితి ఏంటి?
Vijay_Sangeetha
చాలాకాలంగా దూరంగా వుంటున్న విజయ్- సంగీత తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, మనస్పర్థలు తొలగిపోయి, మళ్లీ కలిసి ఒకే ఇంట్లో ఉండటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ జంటను తిరిగి ఒకటి చేయడానికి విజయ్ కుటుంబ సభ్యులు తెరవెనుక గట్టి ప్రయత్నాలే చేసినట్లు సమాచారం.
ముఖ్యంగా విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ ఈ విషయంలో అత్యంత కీలక పాత్ర పోషించారని టాక్ వస్తోంది. కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అలాగే కుటుంబ బంధాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో శోభ స్వయంగా కోడలు సంగీతతో మాట్లాడి, ఇరుపక్షాల మధ్య ఉన్న విభేదాలను సక్సెస్ ఫుల్‌గా సెటిల్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇందుకు విజయ్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.
మరోవైపు త్రిష పరిస్థితి ఏంటని.. అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విజయ్- త్రిషల మధ్య ఏదో నడుస్తుందని టాక్ వచ్చిన తరుణంలో.. విజయ్- సంగీత కలిస్తే త్రిష హుందాగా పక్కకు తప్పుకుంటుందా అనేది తెలియాల్సివుంది. ఇప్పటికే ఆమె సినిమాల్లో బిజీగా వున్న తరుణంలో.. విజయ్ తనను పక్కన బెట్టినా పెద్దగా పట్టించుకోకపోవచ్చునని తెలుస్తోంది.
త్రిషను వదిలించుకోవడానికే విజయ్ సంగీతతో కలిసి జీవించేందుకు సిద్ధమవుతున్నారని.. రాజకీయ నాయకునిగా తనపై ఎలాంటి రూమర్స్ లేకుండా వుండేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సంగీత ఫ్యామిలీ విజయ్‌తో కలిపి జీవించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని.. సంగీతకు రెండో పెళ్లి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఏవి నిజమో తెలియాలంటే తప్పకుండా వేచి చూడాల్సిందే.
