విజయ్-త్రిష: ఔను... వాళ్లిద్దరూ కలిసే వచ్చారు, వీడియో వైరల్
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు తీవ్రంగా ఎవరిపైననా చర్చ జరుగుతుంది అంటే వారెవరో కాదు నటుడు విజయ్, ఆయన భార్య సంగీత, నటి త్రిష. తాజాగా విజయ్-త్రిష ఇద్దరూ ఓ పెండ్లి వేడుకకి వచ్చి వెళ్లారు. ఇద్దరూ కలిసి వచ్చారు. అక్కడ జంటను దీవించి పూలబొకె ఇచ్చి మళ్లీ కలిసే వెళ్లారు. దీనిపై తమిళ తంబీలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు విజయ్ కుమార్తె కాన్వకేషన్ జరిగితే అక్కడికి వెళ్లేందుకు తీరిక లేని విజయ్‌కు త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లేందుకు మాత్రం టైం దొరికిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు విజయ్ భార్య సంగీత వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు విజయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. కోర్టు ఆవల భార్య సంగీతకు రూ. 250 కోట్లు ఇచ్చి సమస్యను సెటిల్ చేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. విజయ్ భార్య విడాకుల కోసం దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు విజయ్ కుమారుడు సైతం తండ్రి ఇన్ స్టాగ్రాం ఎకౌంటును అన్‌ఫాలో చేసాడు. దీనితో వ్యవహారం ముదిరిపోయినట్లు కనిపిస్తోంది.