సంబంధిత వార్తలు
- దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్
- ప్రేక్షకులను ఆకర్షించేందుకు హద్దులు దాటేస్తున్నారు.. నియంత్రణ ఉండాల్సిందే.. కంగనా రనౌత్
- వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలి : కంగనా రనౌత్
- బాలీవుడ్లో మతపరమైన వివక్ష ఉందా? రెహ్మాన్‌ను నిలదీసిన కంగనా రనౌత్
- నా ఇంటిని కూల్చివేసిన వారికి తగిన శాస్తి జరిగింది : కంగనా రనౌత్
వీర్ దాస్‌తో కంగనా రనౌత్ కిస్సింగ్ సీన్.. పెదవులకు గాయం.. అసలు సంగతేంటి?
Vir Das_Kangana Ranaut
ఈ కథనం పూర్తిగా కల్పితమని అని పేర్కొన్న వీర్ దాస్.. ఆ సినిమా షూటింగ్ సమయంలో తమ మధ్య ఎలాంటి సమస్యలూ లేవని చెబుతూ కంగనాకు మద్దతుగా నిలిచారు. కంగనా ప్రొఫెషనల్ నటి అని పేర్కొన్న ఆయన, ప్రచారంలో ఉన్న ఆరోపణలు అన్యాయమైనవని ఎక్స్ ద్వారా తెలిపారు. ఇది ఆమెపై జరుగుతున్న దుష్ప్రచారమని చెప్పారు.
వీర్ దాస్ చేసిన ఎక్స్ పోస్టుపై కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించింది. "థాంక్స్ వీర్.. కానీ ఇంతకీ ఎవరామె? ఈ వయసులో కూడా మన ఇద్దరినీ వాడుకుంటూ తన దెయ్యపు లైంగిక కోరికలను తీర్చుకోవాలని చూస్తున్నట్లుంది. నేనేదో నీ రక్తం తాగేసినట్లు, నువ్వు ఇప్పటికీ ఏడుస్తున్నట్లు కథలు చెప్తోంది... ఎంత విడ్డూరం" అంటూ కంగనా గట్టి కౌంటర్ ఇచ్చింది.
