Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు
Dil Raju, Dheeraj Mogilineni, Rajiv Kanakala, Rohan, Harshini and others
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - ఇటీవల కాలంలో ఇంత సందడిగా మరే సినిమా ఈవెంట్ జరగలేదు. ధీరజ్ వంశీ పైడిపల్లి కజిన్. రెస్టారెంట్ బిజినెస్ రన్ చేసేవాడు. ఒక సందర్భంలో సినిమా ఇండస్ట్రీకి రావాలనే తన ఆలోచన నాతో షేర్ చేసుకున్నాడు. రెస్టారెంట్ బిజినెస్ లో బాగున్నావు కదా సినిమా ఇండస్ట్రీ రిస్క్ అని చెప్పాను. అయినా పట్టుదలగా ఇండస్ట్రీకి వచ్చాడు ధీరజ్..తనదైన దారి వేసుకుంటూ ఈ రోజు హిట్స్ మీద హిట్స్ అందుకున్నాడు. మనకు చిల్డ్రన్ ఫిలిం వచ్చి చాలా కాలమవుతోంది. పిల్లలతో చేసిన ఈ సినిమా ఈ సమ్మర్ లో అందరినీ ఎంటర్ టైన్ చేయాలి, ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు రావాలని కోరుకుంటున్నా అన్నారు.
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ, ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేశాం. సమ్మర్ కు ఎలాగైనా రిలీజ్ చేయాలని అనుకున్నాం. కానీ బెటర్ మెంట్స్ , ఇతర అనుకోని కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోతున్నాం. రిలీజ్ ఆలస్యమవుతున్నా సూపర్బ్ కంటెంట్ తో వస్తున్నామనే గర్వంగా సంతోషంగా ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ గురించి చెబితే కొందరు పిల్లల సినిమా ఎవరు చూస్తారని నిరుత్సాహపరిచారు. నేను చిన్నప్పుడు లిటిల్ సోల్జర్స్ లాంటి మూవీ చూసి ఎంజాయ్ చేశాను. ఇలాంటి జానర్ లో ఏడాదికి ఒక సినిమా వచ్చినా పిల్లలు, ఫ్యామిలీస్ థియేటర్స్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తారని నమ్మాను.
నా స్నేహితుడు గిరి ఈ కథ వినగానే నా మీద నమ్మకంతో ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చాడు. రీసెంట్ గా డిఫ్యూటీ సీఎం కల్యాణ్ గారిని పెద్ద ప్రొడ్యూసర్స్ వెళ్లి కలిశారు. పెద్ద ప్రొడ్యూసర్స్ కు సమస్యలు ఉన్నట్లే మా చిన్న నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు మేమూ వెళ్లి పవన్ కల్యాణ్ గారిని కలిసి వివరిస్తాం. పైరసీ అరికట్టేందుకు పవన్ కల్యాణ్ గారి సహకారంతో కేంద్రమంత్రి అమిత్ షా గారిని కలవబోతున్నాం. అన్నారు.
బాల నటుడు రోహన్ మాట్లాడుతూ - 90's వెబ్ సిరీస్ తర్వాత ప్రీ వెడ్డింగ్ షో, భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి చిత్రాల్లో నటించాను. సినిమా పోస్టర్ మీద సోలో ఫోటో చూసుకోవాలనేది నా డ్రీమ్. ఈ ఈవెంట్ కు దిల్ రాజు గారు గెస్ట్ గా రావడం మరో గుర్తుండిపోయే విషయం. ఈ సినిమాలో అవకాశం కల్పించిన ధీరజ్ గారికి థ్యాంక్స్. సింజిత్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. శ్రీకర్ గారు ఈ సినిమాలో నన్ను కొత్తగా చూపించారు. నేను ఈ మూవీ కోసం సాధ్యమైనంత కష్టపడ్డాను. మీరంతా మా చిత్రాన్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నటి హర్షిణి మాట్లాడుతూ, ఈ చిత్రంలో నా క్యారెక్టర్ సర్ ప్రైజింగ్ గా ఉందని అందరూ చెబుతున్నారు. కొందరు ప్రముఖులు కూడా ఈ మూవీ చూసి అదే మాట చెప్పారు. నా క్యారెక్టర్ నెగిటవా పాజిటివా అనేది మీరే సినిమా చూసి చెప్పాలి. అన్నారు.
నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ - ఈ చిత్రంలో నేను ఒక మంచి క్యారెక్టర్ లో నటించాను. తూర్పు గోదావరి జిల్లా యాసలో నా క్యారెక్టర్ ఉంటుంది. ఈ పాత్రలో పర్పెక్ట్ గా మాట్లాడేందుకు మా రైటర్ కొండల్ రావు సపోర్ట్ చేశారు. శ్రీకర్ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. బాలనటీనటులు రోహన్, అరుణ్, ఖుషి ఈ సినిమాలో అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు. వారికి ఈ సినిమాతో మరింత మంచి గుర్తింపు వస్తుంది. హర్షిణి పాత్ర సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. అలాగే వాసుకి, హర్షవర్థన్ మంచి క్యారెక్టర్స్ చేశారు. సింజిత్ ఈ సినిమాకు బ్యూటిఫుల్ మ్యూజిక్ అందించారు. అన్నారు.
నటి వాసుకి మాట్లాడుతూ - స్ట్రాంగ్ స్క్రిప్ట్ తో వస్తున్న చిత్రమిది. కంటెంట్ ఈజ్ కింగ్ అన్నట్లు మా మూవీ టీజర్ చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుంది. జీవితంలోని చిన్న చిన్న సందర్భాలు, విషయాలను బ్యూటిఫుల్ గా తెరకెక్కించిన చిత్రమిది. మనందరం ఈ చిత్ర కథతో, సన్నివేశాలతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం. మా డైరెక్టర్ శ్రీకర్ చాలా క్లారిటీగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇలాంటి మంచి చిత్రంలో భాగమయ్యేలా చేసిన ధీరజ్ గారికి థ్యాంక్స్. అలాగే ఈ వేదిక మీద ఉన్న డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారికి థ్యాంక్స్. నాకు వుమెన్, చిల్డ్రన్ ఫిలింస్ అంటే ఇష్టం. వుమెన్, చిల్ర్డన్ గురించి మరిన్ని మూవీస్ రావాలి. అన్నారు.
డైరెక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ - ధీరజ్ గారు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ సినిమాను బాగా చేయగలిగాను. నాకు స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకంతో పాటు ధీరజ్ గారు ఉన్నారనే ధైర్యం ముందుకు నడిపించింది. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా ఆ క్రెడిట్ ధీరజ్ గారికే వెళ్తుంది. రోహన్ ను మా సినిమాలో కొత్తగా చూస్తారు. అలాగే అరుణ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఖుషి ఫ్యూచర్ లో స్టార్ హీరోయిన్ అవుతుంది. ఈ కథ అనుకున్నప్పుడే వాసుకి గారిని అనుకున్నాం. ఆమె ప్రతి సీన్ లో బాగా నటించారు. రాజీవ్ కనకాల గారు, హర్షిణి..వీళ్లంతా తమ పర్ ఫార్మెన్స్ తో మూవీకి స్ట్రెంత్ గా నిలిచారు. సింజిత్ మ్యూజిక్, సాయి ప్రకాష్ డీవోపీ వర్క్, కిట్టు సాహిత్యం మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
