సంబంధిత వార్తలు
- Narne Nithinఫ బొగ్గు గనుల నేపథ్యంలో నార్నే నితిన్..NN6 చిత్రం
- Narne Nithin: నార్నే నితిన్ #NN5 మూవీ హ్యూమరస్ క్రియేటివ్ పోస్టర్ ద్వారా అనౌన్స్‌మెంట్
- మేఘాంశ్ శ్రీహరి హీరోగా థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఆస్మాన్ చిత్రం ప్రారంభం
- Akhil: లెనిన్ కథకు అఖిల్ సూట్ అవుతాడా? అని భయపడ్డాను, కానీ చూశాక హిట్ నమ్మకం కలిగింది : నాగార్జున
- మరోమారు పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్
Narne Nithin :నార్నే నితిన్, అనికా సురేంద్రన్, మేఘా శెట్టి కాంబినేషన్ లో చిత్రం
Venkat K. Narayana clapping the first shot featuring Narne Nithin, Anikha Surendran, and Megha Shetty.
నార్నే నితిన్, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. 'జూనియర్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ రెడ్డితో ఒక యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కోసం జతకట్టారు. #NN5 చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తుండగా, లోహిత ఎన్.కె క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.ఇందులో నార్నే నితిన్ సరికొత్తగా కనిపించనున్నారు. అనికా సురేంద్రన్, మేఘా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.
రొమాన్స్, కామెడీ, మనసుని హత్తుకునే భావోద్వేగాల కలయికతో బలమైన ఎమోషనల్ అంశాలతో కూడిన కంప్లీట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా #NN5 చిత్రం రూపొందుతోంది.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రేక్షకులలో భారీ ఆసక్తిని రేకెత్తించింది. ఆదివారం సంప్రదాయ పూజా కార్యక్రమంతో చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు నిర్మాత వెంకట్ కె నారాయణ క్లాప్ కొట్టగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కెమెరాను ఆన్ చేశారు. 'MAD' చిత్ర దర్శకుడు కళ్యాణ్ శంకర్ ప్రారంభ షాట్‌కు దర్శకత్వం వహించగా, వెంకట్ కె నారాయణ స్క్రిప్ట్‌ను దర్శకుడు రాధాకృష్ణకు అందజేశారు.
ఈ చిత్రానికి ట్యాలెంటెండ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. 'ఆంధ్ర కింగ్ తాలూకా' చిత్రానికి అందించిన అద్భుతమైన సంగీతంతో ప్రశంసలు పొందిన వివేక్ & మెర్విన్ ద్వయం దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. రామ మారుతి ఎం సినిమాటోగ్రఫీ, నిరంజన్ దేవరమనే ఎడిటింగ్, శివ కామేష్ డి ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. శరణ్య పోట్ల, అజయ్ గద్దె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు.
