1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. A Lawyer Reminded Me Why I Make Movies: Adivi Sesh

Adivi Sesh: నేను ఎందుకు సినిమాలు చేస్తున్నానో లాయర్ గుర్తు చేశాడు : అడివి శేష్

Adivi sesh
Supriya Yarlagadda, Anurag Kashyap, Adivi Sesh, Bheems
అడివి శేష్ లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. శానిల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు.
 
హీరో అడివి శేష్ మాట్లాడుతూ, మొన్ననే ‘డెకాయిట్’ బెంగళూరు సెలబ్రేషన్స్‌లో ఉన్నప్పుడు కొంతమంది కలిశారు. తమిళనాడుకు చెందిన ఒక లాయర్  కలిసి తనకు జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాడు. తనను ఎవరో 150 మంది కలిసి కొట్టారట. చాలాకాలం హాస్పిటల్‌లో ఉన్నాడు. బయటకు రావాలంటే భయమేసిందని, తనకు ధైర్యం ఇచ్చింది ‘మేజర్’ సినిమా అని చెప్పాడు.  ‘డెకాయిట్’ రిలీజ్ అవుతుందని తెలుసుకుని హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి మొదటిగా ఈ సినిమానే చూశానని చెప్పాడు. సినిమా చాలా నచ్చిందని, నన్ను కలవడానికి ప్రత్యేకంగా వచ్చానని చెప్పాడు. చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు. అప్పుడు నాకు అర్థమైంది.. మనము సినిమా, బిజినెస్ గురించి ఆలోచిస్తూ మానవత్వాన్ని ఎక్కడో మర్చిపోతాం. ఆయన నాకు ఆ మానవత్వాన్ని మళ్లీ గుర్తు చేశాడు. నేను ఎందుకు సినిమాలు చేస్తున్నానో గుర్తు చేశాడు. 
 
అలాగే ‘మేజర్ సందీప్’ ఫ్యాన్ పేజ్ నిర్వహిస్తున్న వారు ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో పెట్టుకోమని నాకు ఇండియన్ ఫ్లాగ్ ఇచ్చారు. ఇంత ప్రేమను ప్రేక్షకులు, మీడియా  నుంచి పొందుతున్నప్పుడు.. ఇదే క్రెడిబిలిటీ అనిపిస్తుంది. హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది. అందుకే నాకు ‘గుడ్ సినిమా’ శేష్ అనే ట్యాగ్ రావాలని కోరుకున్నాను. అలాంటి సంతృప్తి ఈ సినిమా ఇచ్చింది. ఆ బెంగళూరులో ఆ లాయర్ ని కలిసినప్పుడు వచ్చిన అనుభూతి నాకు ఒక షీల్డ్‌లా అనిపించింది. 
 
ఈ సినిమా కోసం 45 డిగ్రీల వేడి ఉన్న పర్వతాలపై షూటింగ్ చేశాం. కొన్ని సన్నివేశాల్లో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొన్నాం. ప్రేక్షకులకు రియల్ అనుభూతి ఇవ్వాలని చాలా కష్టపడ్డాం. టెక్నికల్ బ్రిలియన్స్ తో పాటు భావోద్వేగాలు, ప్రమాదకర పరిస్థితులు అన్నీ అందులో మిళితమై ఉన్నాయి. అలాగే రెండు భాషల్లో సినిమా తీశాం. ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇవ్వాలనే లక్ష్యంతో పని చేశాం. రామ్ చరణ్ గారు ట్వీట్ చదువుతున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది.  అలాగే నాని గారు కూడా సినిమా గురించి మాట్లాడారు. అలాగే 50 కోట్లు కొట్టిన సందర్భంగా మీడియా ప్రశంసలు.. ఇవన్నీ మా ప్రయత్నాన్ని మీరందరూ గౌరవించిన భావన కలిగింది. అందుకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాలో క్లైమాక్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా మందికి నచ్చింది. అది భీమ్స్ గారి ట్యూన్. నా కెరీర్‌లో ఇది మొదటి మ్యూజికల్ హిట్. బీమ్స్ గారు చేసిన నాలుగు పాటలు కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి. బుక్ మై షోలో టికెట్లు ఫాస్ట్‌గా ఫుల్ అవుతున్నాయి. మీరందరూ చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.
 
నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ, ఆడియన్స్ ఫీడ్బ్యాక్ చాలా ఎనర్జీ ఇస్తుంది. అందుకే మేము సినిమాలు తీస్తాం. ఒక సినిమా క్రియేట్ చేయడంలో క్రియేటివ్ పీపుల్‌కే కాకుండా, నిర్మాతల పాత్ర కూడా చాలా ముఖ్యమైంది. మరింత మంది నిర్మాతలు రావాలి. సినిమా ఎలా చెయ్యలానేది అన్నపూర్ణ స్టూడియోస్‌ లోనే నేర్చుకున్నాను. ఆన్నపూర్ణ స్టూడియోస్‌కు ధన్యవాదాలు. ఆడియన్స్ సినిమా చూసి బాగుంది అని చెప్పినప్పుడు వచ్చే ఆనందం వేరు. ఈ సినిమా తీసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఒక ప్రేమ కథ తీయడంలో ఉండే ఆనందం వేరు. చాలా అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తాయి. ఇలాంటి అవకాశం ఇచ్చిన శేష్, శానిల్ కి థాంక్యూ వెరీ మచ్. ‘డెకాయిట్’పై నమ్మకం ఉంచి, మాకు ఎప్పటికప్పుడు సహకారం అందించిన సునీల్ నారంగ్ గారికి, జాన్వీ నారంగ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 
About Writer
దేవీ