1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. A Romantic Song Featuring Satyadev and Deepa Thomas from Raao Bahadur

Satyadev :రావు బహదూర్ నుంచి సత్యదేవ్, దీపా థామస్‌ పై రొమాంటిక్ సాంగ్

Satyadev, Deepa Thomas
Satyadev, Deepa Thomas
సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్ పై రూపొందుతోన్న చిత్రం రావు బహదూర్. వెంకటేష్ మహా దర్శకుడు. సత్యదేవ్, దీపా థామస్‌ జోడీ. మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించారు. అందులో భాగంగా స్మరణ్ సాయి స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ 'ఓ సుందరి' ఏప్రిల్ 15న విడుదల కానుంది. సత్యదేవ్, దీపా థామస్‌లను రొమాంటిక్ సెటప్‌లో ప్రజెంట్ చేసిన సాంగ్ రిలీజ్ అనౌన్స్మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. 
 
సత్యదేవ్ పొడవాటి జుట్టు, కళ్ళద్దాలతో రెట్రో-కూల్ లుక్‌లో కనిపిస్తుండగా, దీప ఎంతో హుందాగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ బ్యాక్ డ్రాప్ సున్నితమైన లవ్ మెలోడీని సూచిస్తున్నాయి. సైకలాజికల్ ఇంటన్సిటీ, కనుమరుగవుతున్న ఒక రాజరిక ప్రపంచపు అవశేషాలను కలగలిపిన ఎమోషనల్ డ్రామాగా ‘రావు బహదూర్’ రూపుదిద్దుకుంటోంది. రచయిత, దర్శకుడు, ఎడిటర్‌గా వెంకటేశ్ మహా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ కథని మలిచారు.
 
ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్,  శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బలమైన కథాంశాలతో, కంటెంట్‌ బేస్డ్ తెలుగు సినిమాలకు మద్దతుగా నిలిచే ఈ రెండు నిర్మాణ సంస్థలకు ‘రావు బహదూర్’ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా నిలవనుంది. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాటోగ్రఫీని కార్తిక్ పరమార్ నిర్వహిస్తుండగా, సంగీతాన్ని స్మరణ్ సాయి అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌ రోహన్ సింగ్.  
 
తారాగణం: సత్య దేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్
About Writer
దేవీ
తర్వాతి కథనం
Decoit Review: లాజిక్ లేని అడివి శేష్ డెకాయిట్ మూవీ - డెకాయిట్ జన్యూన్ రివ్యూ