Varun Tej: కొరియన్ కనకరాజు లో దక్షా నాగర్కర్, వరుణ్ తేజ్ లపై స్పెషల్ సాంగ్
Varun Tej and Daksha Nagarkar special song
ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. 'రాసగుమ్మడి' ఫుల్ లిరికల్ సాంగ్‌ను జూలై 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వరుణ్ తేజ్, హీరోయిన్ దక్షా నాగర్కర్ కలర్ ఫుల్ లుక్‌తో విడుదలైన సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ మాస్-ఫెస్టివ్ సాంగ్ వైబ్ ని క్రియేట్ చేస్తోంది.
కొరియన్ కనకరాజు లో దక్షా నాగర్కర్ స్పెషల్ సాంగ్ చేస్తోంది. వరుణ్ తేజ్, దక్షా నాగర్కర్‌పై చిత్రీకరించిన రాసగుమ్మడి సాంగ్ కలర్‌ఫుల్ రాయలసీమ జాతర నేపథ్యంలో తెరకెక్కిన మాస్ డ్యాన్స్ నంబర్‌గా ఉండబోతోంది.
పోస్టర్లో ఇద్దరి ఎనర్జిటిక్ లుక్స్, ఫెస్టివ్ వైబ్స్ పాటపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. థమన్ సంగీతం అందించిన ఈ పాట మరో చార్ట్‌బస్టర్‌గా కానుంది.
ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఎస్. థమన్ సంగీతం అందించగా, మనోజ్ రెడ్డి కటసాని డీవోపీగా పని చేస్తున్నారు.
