షూటింగులో 'జైలర్' విలన్‌కు గాయాలు
ఓ చిత్రం షూటింగులో 'జైలర్' చిత్ర ప్రతినాయకుడు వినాయగన్‌కు గాయాలయ్యాయి. దీంతో ఆయనను కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వినాయగన్ ప్రస్తుతం 'ఆడు-3' అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. తొడుపుళ ప్రాంతంలో జరుగుతున్న షూటింగులో భాగంగా ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా, ఆయన ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన భుజం, మెడభాగంలోని నరాలు, కండరాలకు తీవ్ర గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. దీంతో యూనిట్ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రస్తుతం ఆయనకు కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని సూచించారు.
అలాగే, వినాయగన్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 'ఆడు-3' సినిమా షూటింగును మూడు వారాల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు చిత్రం బృందం ప్రకటించింది. ఎన్నో సినిమాల్లో విలక్షణ నటనతో ఆకట్టుకున్నప్పటికీ 'జైలర్' చిత్రంలో పోషించిన విలన్ పాత్ర వినాయగన్‌కు ఎనలేని గుర్తింపు, క్రేజ్‌ను తెచ్చిపెట్టిన విషయం తెల్సిందే.