సంబంధిత వార్తలు
- మళ్లీ పెళ్లి చేసుకోనున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్
- 60 ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ 3వ పెళ్లి, ఏడాదిన్నరగా ఆమెతో డేటింగ్ చేసి...
- జునైద్ ఖాన్‌తో సాయి పల్లవి సినిమా.. ఆమెను తప్పు చెప్పొద్దు...
- విమాన ప్రమాదంలో చనిపోతే.. నా చివరి చిత్రం మాత్రం ఆపొద్దు : అమీర్ ఖాన్
- Aamir Khan: సాయి పల్లవిని అత్యుత్తమ నటిగా అభివర్ణించిన అమీర్ ఖాన్
మరోమారు పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్
బాలీవుడ నటుడు అమీర్ ఖాన్ మరోమారు వివాహం చేసుకున్నారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న అమీర్ ఖాన్ ఇపుడు ముచ్చటగా మూడోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను ఆయన పెళ్లాడారు.
ముంబై నగరంలోని బాంద్రాలో ఆమిర్ నివాసంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ సందర్భంగా పత్రాలపై సంతకాలు చేయడం ద్వారా వారిద్దరూ దాంపత్య బంధంలోకి అడుగుపెట్టారు. గతంలో రెండు సార్లు పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న ఆమిర్.. గౌరీతో రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. అమీర్‌కు ఆమెతో 25 ఏళ్లకు పైగా స్నేహముంది.
మరోవైపు గౌరీకి కూడా గతంలో వివాహమైంది. ఆ తర్వాత ఆమె విడాకులు తీసుకున్నారు. అమీర్ కుమారులు జునైద్ ఖాన్, ఆజాద్ రావ్ ఖాన్, కుమార్తె ఇరా ఖాన్‌తోపాటు గౌరీ స్ప్రాట్ తనయుడి సమక్షంలో వివాహ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమిర్ టీం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఈ వేడుకకు రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీతో సహా పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు హాజరుకావడం గమనార్హం.
