Fauji Latest Update: ఫౌజీ కోసం బ్రిటీషర్లతో పోరాడే యోధునిగా ప్రభాస్ పై యాక్షన్ సీన్స్
Prabhas, Fauji
గత కొద్దిరోజులుగా కోకాపేటలో షూట్ జరుగుతోంది. ఓ దేవాలయంలో బ్రాహ్మణుల వేడుక చేసుకుంటుండగా బ్రిటీషర్స్ సైనికులు వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తుండగా, బ్రాహ్మణుడి గెటప్ లో ప్రభాస్ వచ్చి వారిని కాపాడే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఫైట్ మాస్టర్లు రామ్ లక్మణ్ ఆధ్వర్యంలో యాక్షన్ పార్ట్ చిత్రీకరణ సాగుతోంది. ఇలా దేశభక్తి గాధకు సంప్రదాయానికి పెద్ద పీట వేసే చిత్రంగా రూపొందుతోంది. ఈ సినిమా, 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
నటి ఇమాన్వి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే చిత్రం గురించి అప్ డేట్ కూడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇచ్చారు. "అజ్ఞాతపర్వం ముగిసింది. తిరుగుబాటు మొదలైంది. #Fauzi ప్రపంచవ్యాప్తంగా 2026 డిసెంబర్ 3న ఘనంగా విడుదల కానుంది," అని వారు పేర్కొన్నారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ రక్తంతో తడిసిపోయి, చేతిలో రైఫిల్ పట్టుకుని ఒక రాయిపై కూర్చుని కనిపిస్తున్నారు. ఆయన చుట్టూ నేలపై అనేక మృతదేహాలు పడి ఉన్నాయి. "ఒంటరిగా పోరాడే ఒక బెటాలియన్" (A battalion who fights alone) అనే వాక్యం పోస్టర్‌పై ఉంది.
