1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Actor Pradeep Rawat of Ghajini fame dies at 74

'ఛత్రపతి' విలన్ ఇకలేరు.. కేన్సర్‌తో ముంబైలో కన్నుమూత

pradeep rawat
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి, సై వంటి చిత్రాల్లో ప్రతినాయకుడు పాత్రను పోషించిన ప్రదీప్ రావత్ ఇకలేరు. ఆయన కేన్సర్‌తో పోరాటం చేస్తూ మంగళవారం సాయంత్రం ముంబైలోని భీవండి ఆస్పత్రిలో తుదిశ్వాస విడించారు. దీంతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. 
 
ముఖ్యంగా గజినీ చిత్రంతో దేశ వ్యాప్తంగా విలన్ పాత్రలో మెప్పించి, గుర్తింపు పొందిన ప్రదీవ్ రావత్ వయసు 74 యేళ్లు. గత కొన్నినెలలుగా ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన మంగళవారం సాయంత్రం గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. తెలుగులో 'సై', 'ఛత్రపతి' వంటి చిత్రాల్లో పవర్ఫుల్ విలన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఆయన మరణవార్తతో సినీ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆయనకు భార్య కల్యాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
 
ప్రదీప్ రావత్ మొదట కోకిలాబెన్ ఆసుపత్రిలో, ఆ తర్వాత మరో ఆసుపత్రిలో చికిత్స పొందారని ఆమె తెలిపారు. ఆయన సహనటుడు, 'లగాన్' ఫేమ్ యశీల్ శర్మ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ, "మా గజినీ, లగాన్ దేవా ఇక లేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి" అని భావోద్వేగ పోస్ట్ చేశారు.
 
బీఆర్ చోప్రా రూపొందించిన 'మహాభారత్' సీరియల్లో అశ్వత్థామ పాత్రతో ప్రదీప్ రావత్ తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 'సర్ఫరోష్', 'లగాన్' వంటి చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. అయితే, 2008లో వచ్చిన 'గజినీ' చిత్రంలో పోషించిన ప్రతినాయకుడి పాత్ర ఆయన కెరీర్లోనే మైలురాయిగా నిలిచి, దేశవ్యాప్తంగా విపరీతమైన కీర్తిని తెచ్చిపెట్టింది.
 
తెలుగు చిత్ర పరిశ్రమలోనూ ప్రదీప్ రావత్ తనదైన ముద్ర వేశారు. 'సై', 'ఛత్రపతి', 'భద్ర', 'లక్ష్మీ', 'దేశముదురు', 'స్టాలిన్' వంటి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన గంభీరమైన రూపం, డైలాగ్ డెలివరీ విలన్ పాత్రలకు ప్రాణం పోశాయి. హిందీ, తెలుగుతో పాటు తమిళ, నేపాలీ భాషల్లోనూ ఆయన నటించారు. ప్రదీప్ రావత్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
Aamani: సీతాకోకలా విహరించే ఏడుగురు మహిళల హ్యాపీ జర్నీ