1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Actor Raghava Lawrence enters politics amid buzz over CM Vijay's Trichy East seat

ప్రజలు రమ్మంటున్నారు... రాజకీయాల్లోకి వస్తున్నా : రాఘవ లారెన్స్

raghava lawrence
ప్రజలు రమ్మంటున్నారు.. రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ అన్నారు. ప్రజలు, అభిమానుల నుంచి లభించిన విశేష మద్దతుతో రాజకీయ అరంగేట్రంపై తాను "సానుకూల నిర్ణయం" తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయి ప్రకటన వెల్లడిస్తానని తెలిపారు. 
 
ఆదివారం చెన్నైలోని తన నివాసంలో అభిమానులతో సమావేశమైన అనంతరం లారెన్స్ మీడియాతో మాట్లాడారు. "అనేక మంది నన్ను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించారు. ప్రజలే నన్ను ఆహ్వానిస్తుండటం సంతోషంగా ఉంది. అందుకే ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నాను" అని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే తన తల్లి, మద్దతుదారులతో భారీ సమావేశం నిర్వహించి, తన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడిస్తానని వివరించారు.
 
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ముఖ్యమంత్రి విజయ్, తిరుచ్చి తూర్పు నియోజకవర్గ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ తరపున లారెన్స్ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన తాజా ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
Koratala Siva: కొరటాల శివ పుట్టినరోజు బాలయ్య సినిమా పై గుసగుసలు