Vishal: సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కి కృతజ్ఞతలు తెలిపిన నటుడు విశాల్
ఇటీవలే ఓ సభలో ఎం.జి.ఆర్. పై రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు తమిళచిత్ర పరిశ్రమలో దుమారాన్ని లేపాయి. అందుకు నిన్ననే రాజేంద్ర ప్రసాద్ కూడా తమిళంలో మాట్లాడుతూ క్షమాపణ కోరారు. అందుకు తమిళనడిగర్ సంఘం తరఫున కథానాయకుడు విశాల్ స్పందించారు. రాజేంద్రప్రసాద్ గారికి నమస్కారం. మీ వ్యాఖ్యల పట్ల ఎంజీఆర్ గారిని అభిమానించే మరియు వారితో పనిచేసిన చాలా మంది బాధపడ్డారు ఈ విషయం పై సౌత్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషన్ వివరణ కోరింది.
రాజేంద్రప్రసాద్ గారి హృదయపూర్వక క్షమాపణ కోరారు. నేను రాజేంద్ర ప్రసాద్ గారిని అభినందిస్తున్నాను ఇది రాజేంద్రప్రసాద్ గారి నిజమైన గొప్పతనం మరియు వినయానికి నిదర్శనం. తమిళనాడేకాదు ప్రపంచంలోని ఆయన అభిమానులు కూడా ఫీల్ అయ్యారు. అందుకే మీ నుంచి వివరణ కోరాం. మీరు చూపిన హుందాతనమైన చర్యకు కృతజ్ఞతలు. ఎం.జి.ఆర్.ను ఆరాధించిన, ఆయనతో కలిసి పనిచేసిన ఎంతోమంది మనస్తాపానికి గురైన నేపథ్యంలో వివరణ కోరాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రాజేంద్ర ప్రసాద్ చేసిన హృదయపూర్వక క్షమాపణను అభినందిస్తూ, అది నిజమైన గొప్పతనానికి మరియు వినయానికి నిదర్శనమని విశాల్ కొనియాడారు.