నడిరోడ్డు మీద నటులు విజయ్, అజిత్ ఫైటింగ్, వీడియో వైరల్
నడిరోడ్డు మీద అంతా చూస్తుండగానే హీరోలు విజయ్, అజిత్ ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఒకరికొకరు ముష్టిఘాతాలు ఇచ్చుకుంటున్నారు. విజయ్ కాళ్లతో అజిత్ ను తంతున్నాడు. ఓ గట్టి షాట్ దెబ్బకి అజిత్ పల్టీలు కొడుతూ రోడ్డు పైన తూలుతూ పడిపోయాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలు విషయం ఏంటంటే... ఈ వీడియో నిజమైనది కాదు. ఏఐ జనరేటెడ్. హీరోలిద్దరూ ఫైటింగ్ చేసుకుంటే ఎలా వుంటుందో చూపించేందుకు ఇలా చేసాడట ఓ క్రియేటర్. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ... ఇప్పుడు మన ఉద్యోగాలు ఊడుతున్నట్లే భవిష్యత్తులో హీరోలతే పనే లేకుండా సినిమాలు కూడా వచ్చేస్తాయి. పెద్దపెద్ద హీరోలు సైతం సైలెంటుగా గోళ్లు గిల్లుకోవాల్సిందేనంటూ సెటైర్లు వేస్తున్నారు.