పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సీనియర్ నటి జయసుధ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ చాలా మొండి పట్టుదల వున్నవారంటూ కామెంట్లు చేశారు. అందుకే రాజకీయాల్లో సమర్థవంతంగా ప్రజల కోసం పనిచేస్తున్నారని జయసుధ అన్నారు. చాలామంది నటులు రాజకీయాల్లోకి వచ్చి వెళ్తుంటారు.
కానీ పవన్ కల్యాణ్ అలా కాదు.. సక్సెస్ అయి చూపించారని గుర్తు చేశారు. సినిమాల్లో ఎలా ఎవరికీ తలొగ్గకుండా, దూకుడుగా ముందుకు వెళ్లారో.. అదే తరహాలో రాజకీయాల్లో కూడా తన సత్తా ఏంటో చాటుతున్నారని స్పష్టం చేశారు. సినిమా రంగంలో ఆయన నటిస్తానని అంటే.. ఎంతైనా, ఏదైనా ఇవ్వడానికి నిర్మాతలు, దర్శకులు రెడీగా ఉన్నారు. కానీ వాటన్నింటిని వదులుకొని ప్రజా జీవితానికే మొగ్గు చూపారు.
అందుకు ఆయనను అభినందించాలి. ఇవన్నీ తన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే అని జయసుధ అన్నారు. పవన్ కల్యాణ్ మంచితనాన్ని జయసుధ ఆకాశానికి ఎత్తేసిన వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసి ట్రెండ్ చేస్తున్నారు.