మంగళవారం, 20 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 డిశెంబరు 2025 (14:08 IST)

బిగ్ బాస్‌కు వెళ్ళడంతో కెరీర్ కోల్పోయాను : కరాటే కళ్యాణి

karate kalyani
బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడం వల్లే తన కెరీర్ నాశనమైందని సినీ నటి కరాటే కళ్యాణి అన్నారు. ఆ షోలో పాల్గొడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని, తన సినీ కెరీర్‌కు తీవ్ర ఆటంకం కలిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, 'నేను బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. అక్కడ సంపాదించిన దానికన్నా రెండింతలు నష్టపోయాను. ఆ షో అగ్రిమెంట్ కారణంగా నాకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. 
 
సినిమాలు లేవు. అవకాశాలు లేవు. షోకు వెళ్తే అవకాశాలు కల్పిస్తామని చెప్పార. కానీ బయటకు వచ్చాక నన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఇది నన్ను చాలా బాధపెట్టింది. బిగ్ బాస్ షో వల్లే నేను ఇండస్ట్రీకి కూడా దూరం కావాల్సి వచ్చింది' అని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
బిగ్ బాస్ హౌస్‌ను ఉద్దేశించి కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. ఎంతోమందికి పాపులారిటీతో పాటు సినిమా అవకాశాలు తెచ్చిపెట్టిన బిగ్ బాస్ షోపై ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.