1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. actress Renu Desai experiences the serene beauty of Kashi

కాశీలో రేణూ దేశాయ్.. ఎందుకో తెలుసా?

renu desai
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ కాశీ యాత్రలో ఉన్నారు. పవన్ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత, తన పిల్లలు పెద్దవారైన తర్వాత ఆమె సినిమాల్లో రెండో ఇన్నింగ్స్‌లో ప్రారంభించారు. తనకు నచ్చిన పాత్రలను ఎంచుకుంటూ సినిమాల్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు. 
 
అడ్వర్‌టైజింగ్ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన యమునా కిషోర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శంకర్ ఇందుచూడన్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో రేణూ దేశాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆధ్యాత్మిక నగరం కాశీలో జరుగుతోంద. 
 
ఈ సందర్భంగా రేణూ దేశాయ్ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. దర్శకుడు యమునా కిషోర్‌తో పని చేయడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోందని, శంకర్ ఇందుచూడన్ వంటి ప్రతిభావంతుడైన నటుడితో కలిసి నటించడం ఉత్సాహాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా, మహాదేవుడి క్షేత్రమైన కాశీలో షూటింగ్ జరగడం తనకు దైవానుగ్రహంగా భావిస్తున్నట్టు తెలిపారు. అయితే, ఈ సినిమా కథ ఏమిటి, టైటిల్ ఏంటి అనే విషయాలను మాత్రం ఆమె గోప్యంగానే ఉంచారు. దీంతో రేణూ దేశాయ్ కొత్త ప్రాజెక్టుపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ప్రజలు కుక్కలు అని ఎలా అంటాను? టీవీకె గురించి నేనలా అన్నాననీ: రాఘవ లారెన్స్