శుక్రవారం, 13 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 ఫిబ్రవరి 2026 (14:23 IST)

కేన్సర్‌తో పోరాడుతూ సినీ నటి మృతి

vahini actress
సినీ నటి వాహిని ఇక లేరు. గత కొంతకాలంగా బ్రెస్ట్ కేన్సర్‌తో పోరాడుతూ వచ్చిన ఆమె బుధవారం తుదిశ్వాస విడిచారు. తన స్వస్థలం విజయనగరం జిల్లాలో చివరి శ్వాస విడిచినట్టు సినీ నటి కరాటే కళ్యాణి వెల్లడించారు. వాహిని మృతిపట్ల సహా నటీనటులు, సినీ అభిమానులు తమ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు.
 
48 యేళ్ళ వాహిని విజయనగరంలో జన్మించారు. తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాల్లో కూడా ఆమె నటించారు. సహాయ నటిగా మంచి గుర్తింపు పొందారు. సినిమాలతో పాటు బుల్లితెరపై ఆమె సందడి చేశారు. అనేక హిట్ సీరియల్స్‌లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. 

దీనిపై కరాటే కళ్యాణి స్పందిస్తూ... వాహిని అక్కా.. నిన్ను కాపాడాలని చాలా ప్రయత్నం చేశాను. కానీ కొద్దిసేపటి క్రితమే ఆమె విజయనగరంలో దైవ సన్నిధికి చేరుకున్నారు. మొన్ననే వైద్యులు ఇక కష్టమని చెప్పడంతో ఊరికి తీసుకెళ్లారు. పద్మక్క ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాం అంటూ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు.