Adah Sharma: ఆదా శర్మ బ్యూటీ సీక్రెట్ ఇదే.. క్యారెట్, ఎర్రకారం వుంటే?
బాలీవుడ్ నటి అదా శర్మ తన ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మ రహస్యాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, ఆమె సహజమైన మెరుపును కాపాడుకోవడానికి సహాయపడే ఆహారాలను వెల్లడించింది.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో తాను చూసిన రెసిపీని తాను తయారు చేస్తున్న వీడియోను ఆదా షేర్ చేసింది. ఈ వంటకానికి పుష్కలంగా క్యారెట్లు అవసరమని, వాటిని సన్నగా తరగాలని ఆదా శర్మ వెల్లడించింది.
దీనికి, ఆమె ఒక చెంచా తేనె, ఒక చిటికెడు ఆవాల నూనె, ఉప్పు, ఎర్రకారం, నిమ్మరసం, నువ్వుల గింజలను చల్లాలని తెలిపింది. ఇది తింటే బలంగా తయారు కావడమే కాకుండా.. చర్మం మెరుస్తుందని ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయడం మరిచిపోవచ్చు అంటూ వెల్లడించింది.