శనివారం, 14 మార్చి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 ఫిబ్రవరి 2026 (18:22 IST)

అడివి శేష్ దర్శకత్వంలో అకీరా నందన్

akira - pawan
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ రంగ ప్రవేశంపై ఊహాగానాలు మరింత జోరుగా వినిపిస్తున్నాయి. అకీరా నందన్ ఎంట్రీ ఎపుడు, ఎవరి దర్శకత్వంలో నటిస్తారనే చర్చ ఫిల్మ్ నగర్‌లో జోరుగా సాగుతోంది. 
 
ఈ చర్చలో భాగంగా, టాలెంటెడ్ హీరో, దర్శకుడు అయిన అడివి శేష్ పేరు బయటకు వచ్చింది. ఇంతకుముందు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పరిచయం కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. ఇపుడు అడివి శేష్ తెరపైకి వచ్చి అకీరా నందన్ డెబ్యూ బాధ్యతలు స్వీకరించారనే ప్రచారం ఊపందుకుంది. అకీరాతో అడివి శేష్‌కు ఉన్న సాన్నిహిత్యం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతుంది. 
 
ముఖ్యంగా, రైటర్స్ బ్లాక్ ఫార్ట్  ఫిల్మ్‌కు అకీరా నందన్ సంగీతం అదించినపుడు అడివి శేష్ మద్దతుగా నిలిచారు. ఆ అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. 'క్షణం', 'గూఢచారి', 'మేజర్' వంటి చిత్రాలతో తనదైనముద్ర వేసిన అడివి శేష్... అకీరా కోసం ఒక ప్రత్యేకమైన, వైవిధ్యమైన కథను సిద్ధం చేస్తున్నారనే టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. 
 
అలాగే, తన కుమారుడు అకీరాను ఒక సాధారణ కమర్షియల్ ఎంట్రీ కాకుండా, కంటెంట్ బేస్డ్ మూవీతో లాంచ్ చేయాలని పవన్ కూడా భావిస్తున్నారట. అయితే, ఈ ప్రాజెక్టు‌కు అడివి శేష్ దర్శకత్వం వహిస్తారా, కేవలం కథను మాత్రమే అందిస్తారా అనేదానిపై క్లారిటీ రావాల్సివుంది.