శతక్ చిత్రానికి వ్యాఖ్యాతగా అజయ్ దేవగణ్, ట్రైలర్ విడుదల
శతక్: సంఘ్ కే 100 వర్ష్ చిత్ర నిర్మాతలు ఈ సినిమా యొక్క మోస్ట్ అవేటెడ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ తన గంభీరమైన స్వరంతో ఈ ట్రైలర్‌కు వ్యాఖ్యానం అందించారు. ఆయన ఐకానిక్ వాయిస్ ఈ మొదటి గ్లింప్స్‌కు మరింత లోతును, భారీతనాన్ని మరియు భావోద్వేగాన్ని జోడించింది.
త్యాగం, పట్టుదల, దేశమే ప్రథమం అనే విలువల నేపథ్యంలో సాగే ఈ ట్రైలర్, ఆర్.ఎస్.ఎస్ యొక్క వందేళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. గురూజీ ఎం.ఎస్. గోల్వాల్కర్ గారి స్ఫూర్తిదాయక మాటల ఆధారంగా, చరిత్రలోని అజ్ఞాత అధ్యాయాలను డాక్యుమెంట్ చేయబడిన ఆధారాలతో, భగవా ధ్వజం యొక్క శక్తివంతమైన ప్రతిబింబాల ద్వారా ఈ చిత్రం చూపించనుంది.
ఈ చిత్రంతో తనకున్న అనుబంధం గురించి అజయ్ దేవగణ్ మాట్లాడుతూ, ఆర్.ఎస్.ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు. ఒక శతాబ్దం అనేది కేవలం కాలక్రమంలో ఒక మైలురాయి మాత్రమే కాదు, ఇది దేశ నిర్మాణం కోసం తరతరాలుగా అందించిన అంకితభావం, త్యాగం మరియు కృషికి నిదర్శనం. గత వందేళ్లలో సేవ, ఐక్యత, సాంస్కృతిక గుర్తింపుపై సాగే చర్చల్లో సంఘ్ కీలక పాత్ర పోషించింది. శతక్ ఆ సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతోంది.
ఈ కథకు నా గళాన్ని అందించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇది కేవలం ఒక సంస్థ కథ మాత్రమే కాదు, ఒక గొప్ప సిద్ధాంతం యొక్క కథ, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కాలపరీక్షకు నిలబడిన ఒక ఆలోచన. పట్టుదల, నమ్మకం, సామూహిక లక్ష్యం గురించి చెప్పే ఈ కథకు నా వాయిస్ అందించడం నాకు ఒక గొప్ప అనుభూతిని ఇచ్చింది అని అన్నారు. పనోరమా అసోసియేషన్‌తో కలిసి, వీర్ కపూర్ నిర్మాణంలో, ఆశిష్ మాల్ దర్శకత్వంలో, ఆశిష్ తివారీ సహ-నిర్మాతగా రూపొందిన శతక్ చిత్రం ఫిబ్రవరి 20, 2026న దేశవ్యాప్తంగా విడుదల కానుంది.