పుష్ప 2 తొక్కిసలాటలో గాయపడి శ్రీతేజ్ ను మరోసారి పరామర్శించిన అల్లు అరవింద్, స్నేహా రెడ్డి
Snehareddy and Aravind
పుష్ప 2 సినిమా విడుదలకు ముందు సికింద్రాబాద్ సంథ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళిన బాలుడు శ్రీతేజ్ ను పలు విధాలుగా ఆసుపత్రిలో అల్లు అర్జున్ టీమ్ చికిత్స చేయిస్తున్న విషయం తెలిసిందే. ఆమధ్యే ఒకసారి అరవింద్, అర్జున్ బాలుడి ఇంటికి వెళ్ళి తండ్రిని పరామర్శించారు. తాజాగా అల్లు అరవింద్, స్నేహా రెడ్డి బుధవారం తొమ్మిదేళ్ల శ్రీతేజ్ మరియు అతని కుటుంబాన్ని పరామర్శించారు. 2024 డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాటలో అతని తల్లి రేవతి మరణించగా, అతనికి తీవ్రమైన బ్రెయిన్ డ్యామేజ్ అయింది.
కాగా, నిన్న బాలుడి ఇంటికి వెళ్ళి అక్కడ బాలుడి తండ్రితో మాట్లాడారు. బాలుడి చెల్లెలును పలుకరించి ఆమె విద్యాబ్యాసం గురించి వాకబు చేశారు. ఈ ఘటన తర్వాత వారికి జీవితాంతం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 146 రోజులుగా ఆసుపత్రిలో ఉండి, కేవలం 5% మాత్రమే కోలుకున్న శ్రీతేజ్, ప్రస్తుతం చాలావరకు మంచానికే పరిమితమయ్యాడు. పుష్ప 2 బృందం నుండి అతనికి ₹3 కోట్లకు పైగా సహాయం అందింది. ఇందులో అల్లు అర్జున్ వ్యక్తిగతంగా ₹1 కోటి విరాళం ఇవ్వడంతో పాటు, అన్ని వైద్య అవసరాల కోసం హామీ కూడా ఇచ్చారు. స్వాగత బ్యానర్ మరియు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ హృదయపూర్వక చర్య, కొనసాగుతున్న సవాళ్ల మధ్య నిజమైన బాధ్యతను చూపినందుకు అభిమానుల నుండి ప్రశంసలు అందుకుంది.
