Allu Arjun 23: అల్లు అర్జున్ 23 చిత్రం స్పెషల్ థీమ్ సాంగ్ ర్యాంపేజ్
అల్లు అర్జున్ 23 చిత్రం కోసం డిజైన్ చేసిన స్పెషల్ థీమ్ సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఆరంభం కాకుండానే ఇలా జరగడం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో AA23 వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఈ ఏడాది జులైలో రెగ్యులర్ షూట్ ప్రారంభంకానుంది. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం సమకూరుస్తున్నారు. వర్కింగ్ టైటిల్ తోపాటు థీమ్ ను రూపొందించారు.
AA23 థీమ్ కోసం 1.5 మిలియన్లకు పైగా రీల్స్ & షార్ట్స్ సృష్టించబడ్డాయి. ఒక చారిత్రాత్మక మైలురాయి — సినిమా ప్రకటన థీమ్ కోసం ఇప్పటివరకు అత్యధికం అని నిర్మాణ సంస్థ మైత్రీమూవీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అల్లుఅర్జున్ మరోసారి కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. కథతోపాటు పాటలు, సంగీతం, టేకింగ్ లో నూతనతనాన్ని తీసుకు వచ్చేందుకు తగు సలహాలు కూడా ఇస్తున్నట్లు టాలీవుడ్ కథనాలు చెబుతున్నరాయి. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తన కెరీర్ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇదిలా వుండగా ఈ సినిమాకు నిర్మాణ సంస్థ అనిరుధ్ కు దాదాపు 23 కోట్ల రెమ్యునరేష్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా దర్శకుడు లోకేష్ కు భారీ పారితోషికం ముట్టనుందని కూడా తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ కూడా ఓవర్సీస్ రైట్స్ కూడా తీసుకోనున్నాడని సమాచారం.
కాగా, AA23 అనేది అల్లు అర్జున్ నటించనున్న హై-ఆక్టేన్ పాన్-ఇండియా యాక్షన్ చిత్రం. లోకేష్ కు చెందిన ఇరుంబు కై మాయావి చిత్రంప్రేరణతో యాక్షన్ సన్నివేశాలను కలిగి ఉంటుందని సూపర్ హీరో-నేపథ్య చిత్రంగా వుండనున్నదని తెలుస్తోొంది.