సోమవారం, 9 మార్చి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 మార్చి 2026 (13:07 IST)

పావలా శ్యామలకు అల్లు అర్జున్ ప్రతి నెలా ఆర్థిక సాయం.. ఎంతంటే?

allu arjun
సీనియర్ క్యారెక్టర్ నటి పావలా శ్యామల తీవ్ర అనారోగ్య సమస్యతో పాటు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఆమె దీనస్థితిని తెలుసుకున్న స్టార్ హీరో అల్లు అర్జున్ పెద్ద మనసు చాటుకున్నారు. ఆమెకు ప్రతి నెలా రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. పావలా శ్యామల, ఆమె కుమార్తె వైద్య ఖర్చులు, నిత్యావసరాల కోసం ప్రతి నెల రూ.10 వేలు అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 
 
వందలాది చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆలరించిన పావలా శ్యామల, గత కొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతన్నారు. సరైన ఆదరణ లేక ఆర్థికంగా చితికిపోయి తన కుమార్తెతో కలిసి సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. తల్లీకుమార్తెలిద్దరూ ఆరోగ్యం క్షీణించి, కనీసం మందులు కూడా కొనుగోలు చేసుకోలేని దీనస్థితిలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ తక్షణం స్పందించి, వారికి ప్రతి నెలా రూ.10 వేలు ఇచ్చి ఆదుకోవడంతో పాటు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. 
 
గతంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సాయం చేసిన విషయం తెల్సిందే. అయితే, అల్లు అర్జున్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి తాత్కాలిక సాయం కాకుండా ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవడం గమనార్హం.