1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Allu Arjun launches ICONZA on the occasion of Allu Ramalingaiah's birth anniversary.

అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ICONZAకు శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్

Allu Ramalingaiah's birth anniversary- Allu Arjun family
Allu Ramalingaiah's birth anniversary- Allu Arjun family
స్టార్ అల్లు అర్జున్ తన సృజనాత్మక ప్రయాణంలో మరో కీలక అడుగు వేశారు. తన తాత, ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా ‘ICONZA’ పేరుతో తన కొత్త క్రియేటివ్ ఆఫీస్ స్పేస్‌ను ప్రారంభించారు. స‌రికొత్త ఆలోచనలు, అద్భుత‌మైన సృజ‌న‌, ప‌ర‌స్పర స‌హ‌కారానికి, సంయుక్త కార్యాచ‌ర‌ణ‌కు వేదికగా ‘ICONZA’ను తీర్చిదిద్దుతున్నారు. ఈ నూతన ప్రయాణాన్ని పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. అత్యంత ప్ర‌త్యేక‌మైన ఈ సందర్భాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో మొద‌లుపెట్టిన‌ట్టు ఐకాన్ స్టార్ గ్లింప్స్ షేర్ చేసి తెలిపారు.
 
నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్, ‘ICONZA’ ద్వారా న‌ట‌నా పరిధిని దాటి, తన సృజనాత్మక దృష్టిని మరింత విస్తరించనున్నారు. కొత్త ఆలోచనలు, కళాత్మక భాగస్వామ్యాలు, విభిన్న సృజనాత్మక వెంచర్లకు ఈ వేదిక కేంద్రంగా నిలవనుంది. తన కెరీర్‌లో మరింత విస్తృతమైన, వైవిధ్యభరితమైన కొత్త అధ్యాయానికి  ‘ICONZA’ నాంది పలుకుతోంది.
 
ఇక సినిమాల విషయానికి వస్తే.. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఇటీవల గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించి వార్తల్లో నిలిచింది.  లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘AA23’లో అల్లు అర్జున్ న‌టించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ‘పుష్ప 3: ది ర్యాంపేజ్’తో పాటు మరికొన్ని భారీ క్రేజీ ప్రాజెక్టులు ఆయన లైనప్‌లో ఉన్నాయి.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Fauji Update:: ఫౌజీ రీ షూటింగ్ లో పాల్గొన్న రెబల్ స్టార్ ప్రభాస్