1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. An update on the NTR-Prashanth Neel film, Dragon is coming soon

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్ రాబోతోంది

Prasnath neel, ntr poster
Prasnath neel, ntr poster
ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం డ్రాగన్. వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి తాజా అప్ డేట్ రాబోతోంది. ఈ రాత్రి చిత్రం గురించి కొత్త సమాచారం వుంటుందని సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్ తెలియజేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజు మే20. కనుక ఈరోజు రాత్రే అప్ డేట్ తో గ్లింప్స్ ఇవ్వనున్నట్లు తెలిసింది. మైత్రీమూవీస్, ఎన్.టి.ఆర్. ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోంది.
 
 
ఈ గ్లింప్స్  4 నిమిషాల 35 సెకన్ల సుదీర్ఘ నిడివితో ఉండబోతుండటం ఇండస్ట్రీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్, దేవర చిత్రాల తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడం, కేజీఎఫ్, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో 'డ్రాగన్'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక గ్లింప్స్ కు కూడా సెన్సార్ అయింది. సెన్సార్ బోర్డు నుంచి U/A 16+ రేటింగ్‌తో ధ్రువీకరణ పత్రం కూడా లభించింది. విధ్వంసం మరో రేంజ్‌లో ఉంటుంది అంటూ నిర్మాతలు ఇచ్చిన క్యాప్షన్ అంచనాలను మరింత పెంచేసింది.
 
కాగా, సినిమా తదుపరి షెడ్యూల్‌లో ఓ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. ఈ పాటలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కనిపించబోతుందనే వార్త అభిమానులను మరింత ఉత్సాహానికి గురి చేస్తోంది. మరి అధికారికంగా ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ధ్రువీకరించాల్సి వుంది.
About Writer
దేవీ
తర్వాతి కథనం
Peddi: రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ కు అనూహ్యస్పందన - డాన్స్ కు ఫిదా