ఆనంద్ దేవరకొండ చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాటా?
Anand Deverakonda, Thagshak
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'తక్షకుడు' మూవీ గురించి ఇంట్రస్టింగ్ అప్డేట్ పంచుకున్న నిర్మాణ సంస్థ.గ్లింప్స్ విడుదల చేసింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలకాబోతున్న ఈ చిత్రంలో ఆయన యాక్షన్ హీరోగా కనిపిస్తున్నాడు. చీకటిలో ఎక్కువ భాగం చూపించిన ఈ గ్లింప్స్ లో ప్రేమ కోసం, ప్రతీకారం కోసం పగతో రగిలిపోతున్న ఆనంద్ దేవరకొండ కనిపించాడు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో త్వరలో రానుంది.
ఆనంద్ దేవరకొండ తో 'మిడిల్ క్లాస్ మెలోడీస్' తర్వాత దర్శకుడు వినోద్ అనంతోజు తక్షకుడు రూపొందించారు. వీరిద్దరి కాంబోలో ఇది రెండో సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. టీజర్ అప్డేట్ పంచుకుంది. చేతిలో ఒక గన్..తగలబడుతున్న ఊరు, పరుగులు పెడుతున్న మనుషులు ఇలా ఎదో ఒక సామజిక ఇతివృత్తం ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందనే హింట్ ను మాత్రం పోస్టర్ ఇచ్చింది. విడుదల ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించలేదు. ఓటీటీ సినిమాలు ఎక్కువవుతున్న తరుణంలో తక్షకుడు నేరుగా విడుదల చేస్తున్నారు.