సంబంధిత వార్తలు
- ఇతరుల బాధలో కూడా వినోదం వెతికేవారిని నిలదీసే రోజు రావాలి : అనసూయ
- అనసూయకు గుడికడతాం... అనుమతి ఇవ్వండి... ప్లీజ్
- జూమ్ కాల్లో బోరున విలపించిన యాంకర్ అనసూయ
- Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?
- శివాజీ చేసిన కామెంట్స్‌లో తప్పులేదు.. అనసూయ కూతురు అలాంటి దుస్తులు ధరిస్తే?
హీరో శివాజీ దెబ్బతో చీరకట్టులో తిరుగుతున్న అనసూయ (వీడియో)
హీరో శివాజీ దెబ్బకు ప్రముఖ యాంకర్ అనసూయ చీరకట్టులోకి మారిపోయారు. ఇటీవల తన భర్తతో కలిసి సంప్రదాయబద్ధంగా పట్టుచీరలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను ఓ న్యూస్ చానెల్ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ శివాజీ దెబ్బతో పట్టుచీరలో తిరుగుతున్న అనసూయ అంటూ క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్ అనసూయ దృష్టికి చేరడంతో ఆమె తీవ్రంగా స్పందించారు.
ఆ మీడియా కథనాన్ని ఉద్దేశిస్తూ అనసూయ వ్యంగ్యంగా బదులిచ్చారు. 'తప్పు.. తప్పు... శివాజీ సృష్టించిన చీర అనే వస్త్రాన్ని ధరించి తిరుగుతున్న అనసూయ' అని కదా హెడ్డింగ్ ఉండాలి.. ఎందుకుంటే అంతకుముందు మేమంతా అసలు చీరలు కట్టుకోలేదు అంటూ సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు. ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే ఆమె కామెంట్ సెక్షన్‌ను లాక్ చేశారు. దీంతో నెటిజన్లు స్పందించే వీలు లేకుండా పోయింది.
కొద్ది రోజుల 'దండోరా' మూవీ ప్రమోషన్‌లో పాల్గొన్న శివాజీ మహిళల వస్త్రాధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. మహిళలు నిండుగా దుస్తులు ధరించినపుడే అందంగా ఉంటారని శరీరం కనిపించేలా బట్టలు వేసుకోవడం సరిగాదన్నారు. అలాంటివారిని చూసి బయటకు నవ్వినా లోపల మాత్రం విమర్శిస్తారని చెప్పడం పెను దుమారానికి దారితీసిన విషయం తెల్సిందే. దీంతో శివాజీ దిగివచ్చి క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసిపోయింది. ఇపుడు అనసూయ చీరకట్టులో కనిపించిన వీడియోను న్యూస్ చానెల్ పోస్ట్ చేయడంతో ఈ వివాదం మళ్లీ చెలరేగింది.
Tappu tappu! “Sivaji srushtinchina cheera ane vastraanni dharinchi tirugutunna Anasuya” Idi kada undali header!! Endukante antaku mundu memanta asalu cheerale kattukoledu ???? entamma.. chuskovali kada post chesemundu ????????♀️ https://t.co/9IiFZ7PQgh
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 11, 2026
