సోమవారం, 15 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : శుక్రవారం, 7 నవంబరు 2025 (17:45 IST)

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

Kamal hasan, Un barive, R. Mahendran and team
Kamal hasan, Un barive, R. Mahendran and team
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మరో ఎక్సయిటింగ్ వెంచర్‌ను అనౌన్స్‌ చేశారు. ఈ ప్రాజెక్ట్ తో పాపులర్ స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బరివ్ (అన్బు మణి, అరివు మణి) దర్శకులుగా అరంగేట్రం చేస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ #KHAA, కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా "హంట్ మోడ్ ఆన్" అనే పవర్ ఫుల్ ట్యాగ్‌లైన్‌తో అనౌన్స్ చేశారు.  
 
ఈ సినిమా కమల్ హాసన్‌ ఐకానిక్ స్థాయికి సరిపోయే భారీ యాక్షన్‌ స్పెక్టకిల్‌గా రూపుదిద్దుకోబోతోంది. కమల్‌తో కలసి విక్రమ్‌ సినిమాలో తమ అద్భుతమైన స్టంట్‌ కొరియోగ్రఫీతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన అన్‌బరీవ్‌..  ఇప్పుడు దర్శకులుగా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నారు.
 
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సునీల్‌ కె.ఎస్‌ సినిమాటోగ్రఫీ, జేక్స్‌ బీజోయ్‌  మ్యూజిక్ అందించనున్నారు. ఎడిటింగ్‌ షమీర్‌ కె.ఎం‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ను వినేష్‌ బంగ్లాన్. ఈ ప్రాజెక్ట్‌ త్వరలో షూటింగ్‌ ప్రారంభం కానుంది.