1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Anil Ravipudi experiments with a humorous beach promo featuring Suthi Veerabhadram and Brahmi.

సుత్తి వీరభద్రం, బ్రహ్మి హాస్యభరితమైన బీచ్ ప్రోమోతో అనిల్ రావిపూడి ప్రయోగం

Anil Ravipudi, G.V. Prakash
Anil Ravipudi, G.V. Prakash
దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం విక్లరీ వెంకటేష్ తో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా కొనసాగుతోంది. అయితే ప్రతీ క్రాఫ్ట్ లో పరిజ్నానం వున్న అనిల్ సినిమాలకు జంథ్యాల, ఇవివి సత్యనారాయణ చిత్రాలను, వారి శైలిని ఎంచుకుంటుంటారు. తాజాగా ఆ సినిమాలో పాటలకు ట్యూన్ చేయడానికి సంగీత దర్శకుడు  జీవీ ప్రకాష్ కుమార్ ను కిడ్నాప్ చేసి సముద్ర తీరం ఇసుకలో పూడ్చిపెట్టి  అప్పటి సంథ్యాల సినిమాలోని సుత్తి వీరభ్రదరావు, బ్రహ్మానందాన్ని టార్చెర్ చేసిన సీన్ ను జోడించి.. అనిల్ రావిపూడి పాటలు రాబట్టుకునే కాన్సెప్ట్ తో వీడియో విడుదల చేశారు.
 
 
జాతీయ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ బిజీగా వుండి దొరక్కపోవడంతో మా నిర్మాత ఇలా కట్టి పడేసి రాబట్టుకోవాలన్నారంటూ అనిల్ చెప్పడంతో.. ఆ తర్వాత ట్యూన్ కట్టడానికిి చేతులను బయటి తీయడం, ఆ తర్వాత లిరిక్ రాసేవారు కావాలని అడగగానే. ఇప్పటికే ముందే అనంత్ శ్రీరామ్ ను పూడ్చిపెట్టానంటూ... ఆయన్నుంచి సాహిత్యం పాడించడం అనేవి అనిల్ రావిపూడి చేసిన సరికొత్త ప్రక్రియ. ఈ సరదా రివీల్ వీడియో ఒక క్లాసిక్ జంధ్యాల-శైలి సన్నివేశాన్ని పునఃసృష్టిస్తుంది.
 
ఇదిలా వుండగా, విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో వుంది. గతంలో వెంకటేష్ నటించిన F2 మరియు F3 వంటి చిత్రాలతో సంక్రాంతి బాక్సాఫీస్‌ను శాసించిన రావిపూడితో ప్రకాష్‌కు ఇది మొదటి కలయిక. ఇక ఈ చిత్రం 2027 పండుగ సందర్భంగా విడుదల కానుంది.
About Writer
దేవీ
తర్వాతి కథనం
T. Gopichand : టి. గోపీచంద్ కొత్త చిత్రం సింగ టైటిల్ ప్రోమో రిలీజ్