1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Anushka Sharma credits homeopathy for her health journey; The Liver Doc labels it a triangle of shame

జీవితంలో హోమియోపతి కీలక పాత్ర : కోహ్లీ సతీమణి అనుష్క

anushka - virat
బాలీవుడ్ నటి అనుష్క శర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే తన భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజయాన్ని ఆస్వాదిస్తూ ఆమె చేసిన డ్యాన్స్ వైరల్ అయింది. ఇప్పుడు హోమియోపతి వైద్య విధానానికి మద్దతుగా ఆమె చేసిన ఒక ఇన్‌స్టాన్‌ పోస్ట్ దుమారానికి కారణమైంది. బుధవారం ఆమె చేసిన ఈ పోస్ట్‌రై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి వాదిస్తున్నారు.
 
ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్ రాజన్ శంకరన్‌కు సంబంధించిన ఒక వీడియోను అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేశారు. ఈ సందర్భంగా హోమియోపతితో తనకున్న అనుబంధాన్ని ఆమె పంచుకున్నారు. "నా జీవితంలో హోమియోపతీ కీలక పాత్ర పోషించింది. ఈ ప్రయాణంలో డాక్టర్ రాజన్ శంకరన్ ముఖ్యమైన భాగస్వామి. ఆరోగ్యం, జీవనశైలిపై ఆయన అభిప్రాయాలను నేను ఎంతో గౌరవిస్తాను" అని ఆమె పోస్టులో పేర్కొన్నారు.
 
ఆమె పోస్ట్ చేసిన కొద్దిసేపటికే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీలు వైద్య చికిత్సల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, శాస్త్రీయత లేని వైద్య విధానాన్ని ప్రోత్సహించడం బాధ్యతారాహిత్యమని పలువురు విమర్శించారు. మరికొందరైతే, అనుష్క ఇలాంటి వాటిని ప్రోత్సహించడం చూసి ఆమె ఫ్యాన్ వైదొలగుతున్నామని కామెంట్స్ పెట్టారు.
 
అయితే, మరికొందరు అనుష్కకు మద్దతుగా నిలిచారు. వైద్యం అనేది వ్యక్తిగత ఎంపిక అని, తనకు నమ్మకం ఉన్న దాని గురించి చెప్పడంలో తప్పేమిటని ప్రశ్నించారు. అల్లోపతిలో తగ్గని దీర్ఘకాలిక సమస్యలకు హోమియోపతితో పరిష్కారం దొరికిందని కొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ వివాదంపై అనుష్క శర్మ ఇప్పటివరకు స్పందించలేదు. ఇటీవలే అనుష్క, విరాట్ కోహ్లి దంపతులు బృందావన్ లోని ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించడం కూడా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు.. గంటకు 40 వేల టిక్కెట్లు విక్రయం