కొత్త వాళ్ళని శ్రీకాంత్ ని దసరాతో పరిచయం చేశాం. అలాగే కేజే క్యూ దర్శకుడు కూడా కొత్తవారే. ఆ సినిమా కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే దుల్కర్ తో చేస్తున్న సినిమా కూడా కొత్త దర్శకుడే. దుల్కర్, పూజ హెగ్డే కలిసి చేస్తున్న సినిమా అద్భుతంగా వస్తోంది. వాళ్ల కాంబినేషన్ చాలా బాగుంటుంది. మేము కొత్త డైరెక్టర్స్ కి చాలా ఫ్రీగా ఫ్రీడం ఇస్తాము. దుల్కర్ సినిమా అమెరికాలో దాదాపు 35 రోజులు షూటింగ్ ఉంటుంది అని నిర్మాత సుధాకర్ చెరుకూరి అన్నారు.
మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి బ్లాక్ బస్టర్ భర్త మహాశయులకు విజ్ఞప్తి.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. జనవరి 13న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి బ్రేక్ ఈవెన్ అయింది కదా.. హ్యాపీగా ఉన్నారా?
-చాలా హ్యాపీ. ఆంధ్ర మొత్తం ఆల్మోస్ట్ అయింది. ఇది లాంగ్ వీకెండ్. సోమవారం కూడా హాలిడే. నైజం తో పాటు మిగతా ఏరియాలో కూడా అయిపోతాయి. ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ కూడా చాలా హ్యాపీగా వుండటం మాకు ఎంతో ఆనందం ఇచ్చింది.
పండక్కి రావాలనే ముందే ప్లాన్ చేసుకున్నారా?
మేము పండగకి రావాలనే ఈ సినిమాని మొదలుపెట్టాం. 65 రోజుల్లో పూర్తి చేశాం. రెగ్యులర్ రవితేజ గారి సినిమాల కాకుండా పండగకి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఈ సినిమాని తీసుకురావాలని ఉద్దేశంతోనే ప్రారంభించాం. సినిమాని అడుయన్స్ అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలనే భావిస్తున్నాం.
పండగకి వచ్చిన అన్ని సినిమాలు విజయాలు సాధించాయి. ఎలా అనిపిస్తుంది?
-అరుదైన గొప్ప విషయం ఇది. వచ్చిన ఐదు సినిమాలు కూడా అద్భుతంగా ఆడాయి. సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా ఫస్ట్ ఆప్షన్. అందరూ ఆ సినిమాని చూసేశారు. ఇప్పుడు సెకండ్ వీక్ నుంచి మిగతా సినిమాలన్నీ కూడా రన్ అద్భుతంగా ఉండబోతుంది. రెండో మూడో వారాలు కూడా చాలా మంచి రన్ వుంటుంది.
నానితో ప్యారడైజ్, దుల్కర్ సినిమా, ఈ సినిమా.. ఒకేసారి చేయడం ఎలా అనిపించింది?
-రవితేజ గారి సినిమా అన్నిటికంటే ముందు వస్తుందని మాకు తెలుసు. అందుకే ఇదే సినిమా మీద కాస్త ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. పారడైజ్ కి మంచి టీం వుంది. మా సొంత మనుషులు ఉన్నారు. అన్ని సినిమాలు కూడా అద్భుతంగా జరుగుతున్నాయి
రామ్ చరణ్ గారి సినిమా కూడా మార్చిలోనే ఉంది కదా?
మేమంతా ఫ్రెండ్స్. సమ్మర్లో బోలెడంత గ్యాప్ ఉంది. పెద్ద సినిమాలు ఏమీ లేవు. నెలకి ఒక్క సినిమా వచ్చినా చాలు. ఇప్పుడే డిస్ట్రిబ్యూటర్స్ మీద రుద్దేసి తప్పు చేశాం. మళ్ళీ అలా జరగకూడదు.
చిరంజీవి గారి సినిమా ఎప్పుడు
-పారడైజ్ అయిపోయిన వెంటనే అది మొదలుపెడతాం. అది పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ కథ.
-అలాగే కిషోర్ తిరుమల గారితో ఒక లవ్ స్టోరీ చేయబోతున్నాం. నటీనటులు ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు.
-నాకు అరుంధతి లాంటి సినిమా చేయాలన్న ఉంది. అలాంటి ఒక కథపై కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.