1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Are you coming with an alliance, or going solo? Prakash Raj tweets about Pawan; Bandla Ganesh fires back in X

పొత్తుతో వస్తున్నారా, సింగిల్‌గానా? పవన్‌పై ప్రకాష్ రాజ్ ట్వీట్: నీకెందుకురా అంటూ బండ్ల గణేష్ ఫైర్

Prakash Raj
తెలంగాణలో జనసేన పార్టీ కూడా పోటీ చేస్తుంది అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత ఎవరికివారు తమతమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఐతే సినీ నటుడు, just asking అంటూ సెటైర్లు వేసే ప్రకాష్ రాజ్ x లో ట్వీట్ చేస్తూ... మీరొస్తానంటె మేమొద్దంటామా? రండి దొర .. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్‌గా వస్తున్నారా? అది చెప్పి రండి . #justasking అంటూ పోస్ట్ చేసారు. ఈ పోస్టును చూసిన నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రిప్లై పోస్ట్ చేసారు.
 
ఆయన మాటల్లోనే... నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్ అంటూ పేర్కొన్నారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
నటి త్రిషకు వేసవి గిఫ్ట్ హ్యాంపర్ పంపిన ఉపాసన.. ఏంటది?