శుక్రవారం, 23 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 డిశెంబరు 2025 (15:30 IST)

ఆరేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత రెండో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ నటుడు...

arjunrampal gabriella
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ రెండో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన మోడల్, బాలీవుడ్ నటి గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్‌ను పెళ్ళి చేసుకోనున్నారు. ఈ విషయాన్ని అర్జున్ రాంపాల్ స్వయంగా వెల్లడించారు. 
 
2019లో మెహర్‌ జెసియాకు అర్జున్‌ రాంపాల్‌ విడాకులిచ్చారు. ఆ తర్వాత నుంచి గాబ్రియెల్లాతో రిలేషన్‌ కొనసాగిస్తున్నారు. పెళ్లికి ముందే వీరు తల్లీదండ్రులవడం గమనార్హం. వీరికి ఇద్దరు కుమారులు. గతంలో ఓ ఇంటర్వ్యూలో దేవుడిచ్చిన రెండో అవకాశమంటూ గాబ్రియెల్లాపై ప్రేమను చాటారు. అప్పుడే.. మెహర్‌తో విడాకుల గురించి కూడా స్పందించారు. వైవాహిక జీవితంలోని తప్పులకు పూర్తి బాధ్యత తనదేనని అన్నారు.
 
గాబ్రియెల్లా మోడల్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌. సౌతాఫ్రికాలో జన్మించారు. 16 ఏళ్లకే మోడలింగ్‌ ప్రారంభించిన గాబ్రియెల్లా.. ఆ తర్వాత భారత్‌కు వచ్చింది. పలు మ్యూజిక్‌ వీడియోల్లో నటించింది. అలా సినిమా అవకాశాలూ దక్కాయి. హిందీ చిత్రం ‘ఇష్క్‌ ఝమేలా’లో అర్జున్‌- గాబ్రియెల్లా కలిసి నటించారు. 
 
తెలుగులో ‘ఊపిరి’ సినిమాలో ఫ్రెంచ్‌ డ్యాన్సర్‌ జెన్నీగా అలరించింది గ్రాబియెల్లా. వైవిధ్యభరితమైన పాత్రలతో ఆకట్టుకునే అర్జున్‌ రాంపాల్‌.. ‘భగవంత్‌ కేసరి’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బిలియనీర్‌ రాహుల్‌ సాంఘ్వీగా ప్రతినాయక పాత్రలో మెప్పించారు. బాలీవుడ్‌ రీసెంట్‌ హిట్‌ మూవీ ‘ధురంధర్‌’లో మేజర్‌ ఇక్బాల్‌గా నటించారు.