సంబంధిత వార్తలు
- Rajinikanth : జైలర్ 2లో షారుఖ్ ఖాన్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడా ?
- Hansika: గృహ హింస ఆరోపణలపై హన్సిక మోత్వాని పరువు నష్టం దావా
- కనీసం 5 మంచి బంతులేసినా గెలిచేవాళ్లం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా
- AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్.- అంచనాలు రెట్టింపు చేసిన టీం
- ఏప్రిల్ ఫూల్ కాదు... వంట గ్యాస్ వాయింపుడు... రూ.195 పెంపు
ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్
ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆమెకు గుండెపోటుతో పాటు గుండె ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి డాక్టర్ ప్రతీత్ సందానీ ఓ ప్రకటనలో వెల్లడించారు.
భారత సినీ సంగీత ప్రపంచంలో ఆశా భోంస్లే ఒక శిఖరం వంటివారు. 1943లో మరాఠీ చిత్రం 'మాఝా బల్'తో తన కెరీర్‌ను ఆమె ప్రారంభించారు. 1948లో హిందీ చిత్రం 'చునరియా'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దశాబ్దాల సుధీర్ఘ కేరీర్‌లో హిందీతో పాటు 20కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో దాదాపు 12 వేలకు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు. ఆర్.డి. బర్మన్, ఇళయరాజా, ఏఆర్ రెహ్మాన్ వంటి ఎందరో ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి ఆమె పని చేశారు.
ఆమె సంగీత సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం గత 2000లో అత్యున్నత సినీ పురస్కారం 'దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు', 2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మవిభూషణ్'తో సత్కరించింది. వీటితో పాటు ఆమె అనేక ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు. గాయనిగానే కాకుండా 2013లో యామ్ అనే మరాఠీ చిత్రంలో నటిగా కూడా కనిపించారు.
