శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 మార్చి 2017 (19:31 IST)

బాహుబలి-2 ట్రైలర్.. పీక్ సీన్ రిలీజ్.. కట్టప్ప ఎందుకు చంపాడో తెలుస్తుందా?

బాహుబలి-2 ట్రైలర్ గురువారం (మార్చి 16) రిలీజ్ కానుంది. ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పిక్చర్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌తో బాహుబలిని మించిన స్థాయిలో బాహుబలి-2కి ప్రచారం ప్రారంభించిన చిత్ర యూనిట్‌ తాజాగా మరోసారి ప్ర

బాహుబలి-2 ట్రైలర్ గురువారం (మార్చి 16) రిలీజ్ కానుంది. ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పిక్చర్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌తో బాహుబలిని మించిన స్థాయిలో బాహుబలి-2కి ప్రచారం ప్రారంభించిన చిత్ర యూనిట్‌ తాజాగా మరోసారి ప్రేక్షకుల ఆసక్తిని పీక్‌ స్టేజ్‌కు తీసుకెళ్లింది. తాజాగా ట్రైలర్‌లోని ప్రభాస్‌పై ఉన్న చిన్న నిడివి సీన్‌ను విడుదల చేసింది. పీక్ సీన్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ సీన్ చూడటం కోసం నెటిజన్లు ఎగబడుతున్నారు. 
 
మరోవైపు బాహుబలి- ద కంక్లూజన్' ట్రైలర్ కోసం తెలుగు ప్రేక్షక లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఈ గురువారం ట్రైలర్ విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు నిమిషాల 20 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ కు సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ ఇంటర్నెట్లో హడావిడి చేస్తోంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న బిలియన్ డాలర్ల సందేహం కొంతైనా ఈ ట్రైలర్ ద్వారా తీరే అవకాశం ఉందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.