పెళ్ళిళ్లు పెటాకులు కావడానికి కారణాలు వివరించిన నటుడు సుబ్బరాజు
తెలుగు చిత్రపరిశ్రమలోని ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లలో ఒకరు సుబ్బరాజు. 'బాహుబలి' చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన లేటు వయసులో గత యేడాది వివాహం చేసుకున్నారు. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను లేటు వయసులో వివాహం చేసుకోవడాని గల కారణాలను వివరించారు.
దీనిపై ఆయన స్పందిస్తూ, చాలామంది ఇంట్లో వాళ్ల ఒత్తిడితో లేదా వయసు పెరిగిపోతోందనో పెళ్లి చేసుకుంటారని సుబ్బరాజు చెప్పారు. ఇది సరైన నిర్ణయం కాదన్నారు. నీకు ఏదో వస్తుందని ఆశపడి చేసుకునేది వివాహం కాదన్నారు. అలాగే, నీకు భాగస్వామిగా వచ్చే వారికి ఏమి ఇవ్వగలవు అనేదానిపై ఆధాపడి ఉండాలని అన్నారు.
భాగస్వామిపై భారీగా పెట్టుకునే అంచనాలే పెళ్ళిళ్లు పెటాకులు అయ్యేందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయన్నారు. తన భార్య అలా ఉండాలని, తన భర్త ఇలా ఉండాలని ముందుగానే ఊహించుకుంటారని, పెళ్లయిన తర్వాత వాస్తవం అలా లేకపోతే మనస్పర్థలు తలెత్తుతున్నాయన్నారు. తన భార్యకు తన సర్వస్వం ఇవ్వగలను అని నమ్మకం వచ్చిన తర్వాత తాను పెళ్లి చేసుకున్నానని చెప్పారు.