సోమవారం, 9 మార్చి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 3 మార్చి 2026 (21:29 IST)

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

sivaji
తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం అనూహ్యంగా పుంజుకున్నది. ప్రాంతాలతో సంబంధం లేకుండా వృద్ధి చెందింది. చాలామంది రియల్టర్లు భూములను కొనడం అమ్మడం చేస్తుంటారు. కొంతమందికి బాగా కలిసి వస్తుంది. మరికొంతమందిని ముంచేస్తుంది. ఇంకొంతమందిని మధ్యస్థంగా నిలబెడుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు శివాజీ కూడా భూములను కొనడం అమ్మడం చేస్తుంటారు. దీనిగురించి ఆయన ఒక ఛానల్ వారితో పంచుకున్నారు.
 
భూములు అమ్మడంపై ప్రత్యేకించి యాదగిరిగుట్ట వద్ద 18 ఎకరాలు అమ్మడం అనేది తన జీవితంలో ఎప్పటికీ గుర్తిండిపోతుందని అన్నారు. అక్కడ తను ఎకరం రూ. 70 వేలకు కొని ధర పెరిగింది కదా అని ఎకరం రూ. 9 లక్షల చొప్పున మొత్తం 18 ఎకరాలు అమ్మేశారట. ఐతే ఇప్పుడక్కడ ఎకరం రూ. 100 కోట్లు అయ్యిందట. అంటే... 18 ఎకరాలు 1800 కోట్లు. కనీసం ఒక్క ఎకరం అయినా అట్టేపెట్టుకోవాల్సింది కదా అంటూ శివాజీ నిట్టూర్చారు.