శనివారం, 15 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 14 నవంబరు 2025 (14:25 IST)

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

Mumbai PVR Juhu joins Balakrishna, Boyapati Srinu
Mumbai PVR Juhu joins Balakrishna, Boyapati Srinu
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన చిత్రమే అఖండ 2 తాండవం. వీరి కాంబినేషన్ లో నాలుగు వరుస హిట్స్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న ఐదవ సినిమా ఇది. కాగా దీనిపై భారీ హైప్ నెలకొంది. ముంబైలో ఈరోజు PVR జుహులో  వేడుక జరుగుతుంది. ఇందులో ప్రధానంగా సౌండ్ సిస్టమ్ గురించి థమన్ ఏం చెప్పబోతున్నాడో ఆసక్తికరంగా వుంది. 
 
మొదటి భాగానికి సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన పనితనంతో ఇప్పుడు పార్ట్ 2 కూడా గట్టిగానే రీసౌండ్ చేస్తుందని అంచనాలు పెరిగాయి. ఇక ఇటీవల వచ్చిన ప్రోమోకి కూడా సాలిడ్ రెస్పాన్స్ రాగా ఈ ప్రోమో కాకుండా నేడు ఫుల్ సాంగ్ పైనే అందరి కళ్ళు పడ్డాయి. మరి ఈ సాంగ్ ఈరోజు సాయంత్రం 5 గంటల 9 నిమిషాలకి రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ చిత్రానికి 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహించగా ఈ డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.