సంబంధిత వార్తలు
- Balakrishna: పోషకాహార లోపం వల్లే అన్నవాహిక క్యాన్సర్ లు వస్తాయి : నందమూరి బాలకృష్ణ
- అమరావతిని ఏకైక రాజధాని.. ఏపీ ప్రజలందరికీ ఒక చారిత్రాత్మక విజయ క్షణం.బాలకృష్ణ
- ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక చారిత్రాత్మక విజయ క్షణం: బాలకృష్ణ
- అమరావతి: తుళ్లూరులో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభం- బాలయ్య
- Balakrishna: ఢిల్లీ లో నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం
Balakrishna: జో శర్మా నటించిన ఎం4ఎం’ సినిమా పాటను ప్రశంసించిన బాలకృష్ణ
Balakrishna, Jo Sharma
ఈ చిత్రంలో జో శర్మ - సమ్బీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించి, నిర్మించారు. ఆకట్టుకునే టైటిల్, ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో, M4M ఆసక్తిని పెంచుతోంది.
ఈ మూవీ హీరోయిన్, అమెరికన్ నటి జో శర్మ, ప్రముఖ నటుడు బాలకృష్ణని కలిసి, M4M చిత్రంలోని పాటను ఆయనకు చూపించారు. విజువల్స్, ప్రెజెంటేషన్‌ను చూసి బాలకృష్ణ చిత్రయూనిట్‌ని అభినందించారు. అంతేకాకుండా, “ఎవడు వాడు” అనే క్యాచీ లైన్‌ను ఆయన స్వయంగా హమ్ చేశారు.
ఈ సందర్బంగా జో శర్మ.. బాలకృష్ణ ఆశీస్సులు తీసుకున్నారు. బాలకృష్ణ లాంటి ప్రముఖ నటుడిని కలిసి ఆశీర్వాదాలు పొందడం సంతోషంగా ఉందని జో శర్మ తెలిపారు. ఆయన ఆత్మీయంగా ఆహ్వానించి, చిత్రయూనిట్ అందరికి విషెస్ చెప్పారని, టీమ్‌కి కొత్త ఉత్సాహన్నిచ్చిందని ఆమె చెప్పారు.
మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై, McWin Group USA సహకారంతో రూపొందిన ఈ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
