Balakrishna: తారక్ (జూ.ఎన్.టి.ఆర్.) రాజకీయ ప్రవేశంపై బాలక్రిష్ణ స్పందన హైలైట్
Balakrishna, ntr
ఇంతవరకు బాగానే వుంది. ఈ వార్తలు అంతా అవాస్తం అంటూ చాలామంది అనుకుంటున్నారు. కానీ ఎన్.టి.ఆర్. రాజకీయ ప్రవేశంపై నందమూరి బాలక్రిష్ణ స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. ట్విట్టర్ లో ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా బాలక్రిష్ణ మాట్లాడారు.
టి.డి.పి.లో చంద్రబాబు, లోకేష్ తో పాటు మీరు వున్నారు.. మరి జూ. ఎన్.టి.ఆర్. ప్రవేశం అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏమిటని యాంకర్ బాలక్రిష్ణ ను ప్రశ్నిస్తే.. ఆయన మాట్లాడుతూ, అది ఎవరి డెడికేషన్ బట్టి వుంటుంది. ఫుల్ టైం అంటున్నారు. కాబట్టి సినిమాలో భవిష్యత్ చాలా వుంది. నేను అంటే నాన్నగారు వున్నారు. సినిమాలు, రాజకీయాలు చేశాను. వాడు (తారక్) ఇష్టం పట్టి వుంటుంది. వాడిని రమ్మని, ప్రొఫెషన్ వదులుకుని రమ్మని చెప్పముగా. సో అది వాళ్ల వాళ్ల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.
అయితే గతంలో బాలయ్యకు, జూ.ఎన్.టి.ఆర్. కూ నిప్పు ఉప్పు అన్నంతగా కొన్ని వ్యవహారాలు వుండేవి. ఇప్పుడు తమ వాడిగా సంబోధిస్తూ బాలక్రిష్ణ మాట్లాడడం కూడా విశేషంగా వుంది. ఇదంతా ఆంధ్రలో ప్రతిపక్ష హోదా లేని పార్టీ చేస్తున్న అరాచకాలకు గండిపెట్టేవిధంగా ఎన్.టి.ఆర్.ను వాడుకుంటున్నారా? అనే సందేశం కూడా అభిమానుల్లో నెలకొంది. ఏది ఏమైనా ఎన్.టి.ఆర్. టీమ్ నుంచి ఇంతవరకు ప్రకటన రాలేదు. రేపు జులై 18న ఏమైనా వస్తుందేమో చూడాలి.
