Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది
Prashanth Neel's '418' film
డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో వున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి కీర్తన్ నడగౌడ కథ, దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు.
సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆరంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టేలా సరికొత్త హారర్ అనుభూతిని అందించబోతోందని ప్రశాంత్ నీల్ తెలియజేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఈ చిత్రానికి దినేష్ దివాకర్ సినిమాటోగ్రఫీ అందించగా, వెంకీ జీజీ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. ఉల్లాస్ హైడూర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.
